
Vaibhav Sooryavanshi: శ్రీలంక-ఏ ప్లేయర్లతో జరిగిన వివాదం మరువక ముందే.. టీమిండియా యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) దంబూల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి నిరాశపరిచాడు. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే అవుట్ అవ్వడమే కాకుండా.. అతడిని ఔట్ చేసిన ఆఫ్ఘన్ పేసర్ ఇచ్చిన సైలెంట్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
షార్ట్ పిచ్ బాల్‌కు వైభవ్ ఔట్:
మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫరీదూన్ దావూద్‌జాయ్ (Faridoon Dawoodzai) వేసిన ఒక షార్ట్-పిచ్ (Short-pitched) బంతిని వైభవ్ సూర్యవంశీ అగ్రెసివ్‌గా హుక్ షాట్ ఆడటానికి ట్రై చేశాడు. అయితే దావూద్‌జాయ్ వేసిన స్పీడ్‌కు సూర్యవంశీ పూర్తిగా టైమింగ్ మిస్ అయ్యాడు. దాంతో బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ (Top edge) తీసుకుని ఆఫ్-సైడ్ గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఆఫ్ఘన్ ప్లేయర్ ఖలీద్ తనివాల్ (Khalid Taniwal) మెరుపు వేగంతో క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఫింగర్ ఆన్ లిప్స్:
ఇండియా మోస్ట్ టాలెంటెడ్ యంగ్ బ్యాటర్ వికెట్ పడగానే ఆఫ్ఘన్ బౌలర్ ఫరీదూన్ దావూద్‌జాయ్ గ్రౌండ్‌లోనే ఊగిపోయాడు. సూర్యవంశీ వైపు చూస్తూ.. తన నోటిపై వేలు వేసుకుని సైలెంట్‌గా ఉండాలనే (Finger-on-lips gesture) సిగ్నల్ చేస్తూ, సెలబ్రేట్ చేసుకున్నాడు. గత మ్యాచ్‌లోనే లంక ప్లేయర్లతో గొడవపడి హాట్ టాపిక్‌గా మారిన సూర్యవంశీని ఉద్దేశించే ఆఫ్ఘన్ బౌలర్ ఈ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సెలబ్రేషన్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది.
ఫ్యాన్స్‌ను కంగారు పెడుతున్న వైభవ్ ఫామ్:
డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్ లో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ 15 ఏళ్ళ కుర్రాడు.. ఇండియా-ఏ తరఫున వరుసగా ఫెయిల్ అవ్వడం ఫ్యాన్స్‌ను కాస్త కంగారు పెడుతోంది. రాబోయే మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీ ఈ ఒత్తిడిని అధిగమించి, గట్టిగా కమ్‌బ్యాక్ ఇచ్చి తన ఫామ్‌ను నిరూపించుకోవాలని క్రికెట్ లవర్స్ కోరుకుంటున్నారు.
THE DISMISSAL OF VAIBHAV SOORYAVANSHI.
– Struggled with short balls in all 4 games. pic.twitter.com/VEnB6oPOnu
— Maina Singh (@Maina_Singhx77) June 17, 2026
🚨 celebration from the bowler after dismissing vaibhav sooryavanshi 🚨 pic.twitter.com/NvDY6D2f06
— Wade (@Crick_buttowski) June 17, 2026