Reading Time: 2 minutes

వైభవ్ మామూలు ఆటగాడు కాదు.. అతనికి దిష్టి తీయండి.. 15 ఏళ్ల కుర్రాడిపై అశ్విన్ ప్రశంసలు

Caption of Image.

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున పరుగుల వరద పారిస్తున్న 15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 రన్స్ చేసి, త్రుటిలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న వైభవ్ బ్యాటింగ్ కి ఆర్. అశ్విన్ ఫిదా అయ్యారు.

వైభవ్కి దిష్టి తీయండి: 
నేను 15 ఏళ్ల కుర్రాడి కార్డును ఉపయోగించాలనుకోవడం లేదు.. కానీ, ఈ స్థాయి మానసిక పరిపక్వత (Mental Maturity) సాధించడానికి ఈ వయసులో అతను ఎన్ని మ్యాచ్‌లు ఆడాడో చెప్పండి?.. సూర్యవంశీ ఒక సాధారణ ఆటగాడు కాదు.. అతనికి దిష్టి తగలకుండా (Evil eye) చూసుకోవాలని వాళ్ళ అమ్మనాన్నలకు రవిచంద్రన్ అశ్విన్ సూచనలు చేశాడు.  

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకతలు:
సీజన్ లోపలే అద్భుతమైన మార్పులు: ఈ సీజన్ ఆరంభంలో షార్ట్ బాల్స్‌ను నేరుగా ఆడటానికి ప్రయత్నించినప్పుడు వైభవ్ టాప్ ఎడ్జ్ అవుతుండేది. కానీ, కేవలం ఒకే సీజన్ వ్యవధిలో తన బ్యాటింగ్‌ను మార్చుకున్నాడు.. ఎలిమినేటర్‌లో థర్డ్ మ్యాన్ మీదుగా అతను కొట్టిన ఆ అప్పర్ కట్ సిక్సరే అందుకు నిదర్శనం.. అంత త్వరగా తప్పులు సరిదిద్దుకోవడం గొప్ప విషయం అని పేర్కొన్నాడు. 

టీమ్-ఫస్ట్ అటిట్యూడ్: మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంటర్వ్యూలో వైభవ్ ‘సెంచరీల సంగతి తర్వాత చూసుకోవచ్చు, ఈరోజు నా జట్టు కోసం మ్యాచ్ గెలవడానికే నేను ప్రయత్నించాను అని చాలా పరిణతితో మాట్లాడాడు.. అతను బ్యాటింగ్ చేసే తీరు చూస్తుంటే శతకాల గురించి పెద్దగా పట్టింపు లేదనిపిస్తోంది.. ఎందుకంటే, అవి ఎప్పుడో ఒకప్పుడు ఎలాగూ వస్తాయని అతనికి తెలుసు అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. 

ALSO READ : గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మధ్య హైవోల్టేజ్ పోరు..

ఒత్తిడిని జయించిన తీరు: ప్లేఆఫ్స్ వంటి హై-ప్రెజర్ మ్యాచ్‌లో, ప్యాట్ కమిన్స్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొని ఇంత చిన్న వయసులో ఒత్తిడిని అధిగమించిన తీరు అద్భుతమని ఆర్. అశ్విన్ కొనియాడారు. కాగా ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా 243 రన్స్ చేయగా, సన్‌రైజర్స్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్ 2కు దూసుకెళ్లింది. వైభవ్ ప్రస్తుతం 680+ పరుగులతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. 

©️ VIL Media Pvt Ltd.