July 15, 2026

IPL 2026 Playoffs Chances: హీటేక్కిస్తున్న ప్లేఆఫ్స్ రేస్.. టాప్-4 కోసం 10 జట్లకు ఎన్ని విజయాలు కావాలి?

IPL 2026 Playoffs Chances: హీటేక్కిస్తున్న ప్లేఆఫ్స్ రేస్.. టాప్-4 కోసం 10 జట్లకు ఎన్ని విజయాలు కావాలి?
Reading Time: 2 minutes
Ipl 2026 Playoffs Scenarios How Many Wins Each Team Needs For Top 4

IPL 2026 Playoffs Scenarios for 10 Teams: ఐపీఎల్ 2026 సీజన్ మరింత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కనీసం 16 పాయింట్లు సాధిస్తేనే టాప్-4లో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి జట్టుకూ ఇక నుంచి ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. టాప్ జట్లు తమ స్థానం కాపాడుకునేందుకు పోరాడుతుండగా.. మిగతా జట్లు చివరి ఆశతో బరిలోకి దిగుతున్నాయి. ప్రతి మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికను మార్చే అవకాశముండటంతో.. అభిమానులకు ఉత్కంఠభరిత క్రికెట్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీగా కనిపిస్తోంది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముందంజలో ఉన్న పంజాబ్ కింగ్స్‌ ప్లేఆఫ్స్ చేరడం చాలా సులభం అనే చెప్పాలి. ఆరు విజయాలతో 13 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. మిగిలిన ఆరు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధిస్తే సరిపోతుంది. ఒక్క విజయం సాధిస్తే మిగతా జట్ల సమీకరణాలపై పడాల్సి ఉంటుంది. 12 పాయింట్స్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు తప్పనిసరి. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విన్స్ అవసరం. ఈ నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు చాలా దగ్గరలో ఉన్నాయి.

9 మ్యాచ్‌ల్లో 10 పాయింట్స్ ఖాతాలో వేసుకున్న గుజరాత్ టైటాన్స్ పరిస్థితి కాస్త కఠినంగా ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో కనీసం మూడు విజయాలు సాధించాల్సి ఉంది. 8 పాయింట్స్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. 8 మ్యాచ్‌లలో మూడు విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు తప్పనిసరి. ఈ మూడు జట్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నప్పటికీ కాస్త కష్టమనే చెప్పాలి. గుజరాత్ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. ఈ మూడు జట్లు మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరు గెలవాల్సి ఉంది. ఒక్క ఓటమి ఈ జట్ల అవకాశాలను దెబ్బతీస్తుంది. ఇక నుంచి కోల్‌కతా, ముంబై, లక్నోలాక్ డూ ఆర్ డై పరిస్థితి. ప్రస్తుత ఫామ్ చూస్తే.. అన్ని విజయాలు కష్టమే. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ మూడు జట్లు ఇప్పటికే ఇంటిదారి పట్టాయి.