
పంజాగుట్ట, వెలుగు: నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌తో వాహనం నడుపుతున్న వ్యక్తిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లాకు చెందిన నాగరాజ్(36) అమీర్‌పేట్‌లో నివసిస్తున్నాడు. వాహన చలానాల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆరు నెలలుగా నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగిస్తున్నాడు. శుక్రవారం పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. వాహన నంబర్లపై అనుమానం ఉంటే వాట్సాప్ నంబర్ 87126 61690కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.