Reading Time: < 1 minute

భారీ నష్టాల్లో ముగిసిన మన స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లను ముంచిన ఆ స్టాక్స్.. రూ.5 లక్షల కోట్లు నష్టం

Caption of Image.

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని భారీ నష్టాల్లో ముగించాయి. దీంతో వరుసగా మూడో రోజు కూడా నష్టాలతో ట్రేడింగ్ మెుదలుపెట్టిన సూచీలు చివరికి నష్టాలను మిగిల్చాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 982 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 275 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 215 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 578 పాయింట్లు నష్టపోయాయి. 

మార్కెట్లను అలుముకున్న నెగటివ్ సెంటిమెంట్లు ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటంతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం అమ్మకాలకు దిగటం మార్కెట్లో ఒత్తిడిని పెంచేసింది. మరీ ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన స్టాక్స్ భారీ పతనానికి గురికావటంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. దీనికి ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులే ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇన్వెస్టర్లు దాదాపు రూ.5 లక్షల కోట్లు కోల్పోయారు తమ పెట్టుబడి విలువను.

►ALSO READ | ఫేస్ బుక్ ఉద్యోగులపై AI నిఘా : అటూ ఇటూ కదిలినా ఇట్టే పసిగట్టేస్తోంది.. !

క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 106 డాలర్లకు పెరగటంతో మన స్టాక్ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చల అనిస్థితి ఈ పరిస్థితులకు కారణంగా తెలుస్తోంది. వీటికి తోడు అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగియటం కూడా దేశీయ పెట్టుబడిదారుల సెంటిమెంట్లను దెబ్బతీశాయి. 

ఈరోజు ఇంట్రాడేలో ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియల్టీ రంగాలకు చెందిన కంపెనీల షేర్లలో కనిపించిన అమ్మకాల ఒత్తిడి సూచీలను తలకిందులు చేసేసింది. ఈ క్రమంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు కూడా నష్టాలను నమోదు చేశాయి.

©️ VIL Media Pvt Ltd.