Reading Time: < 1 minute

తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Caption of Image.

తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ తెలిపింది. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్‌ 25 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్న అధికారులు పేర్కొన్నారు. పరిణయోత్సవ మండపాన్ని దశావతారం, అష్టలక్ష్ముల వంటి ఆధ్యాత్మిక రూపాలతో దాదాపు 100 మంది నిపుణులు  అలంకరిస్తున్నారని టీటీడీ ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.

మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపైన ఊరేగుతారు. రెండో రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడవాహనంపై వేంచేస్తారు. మరోవైపు  ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీల్లో పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆ తరువాత కల్యాణ మహోత్సవం కన్నులపండుగగా నిర్వహిస్తారని చెప్పారు.

►ALSO READ | ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు !
 
శ్రీ పద్మావతి పరిణయోత్సవాల వేడుక కోసం పుణేకు  చెందిన శ్రీ వేంకటేశ్వర రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్ రూ.30 లక్షలతో  వేదికను వైభవంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.