Reading Time: < 1 minute
Vivo Y6 5g Launched 7200mah Battery Snapdragon 4 Gen 2 And 120hz Display And More Features Are

Vivo Y6 5G Launch: వివో (Vivo) స్మార్ట్ ఫోన్స్ లోని Y-సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ లాంచ్ అయ్యింది. Vivo Y6 5G పేరుతో వచ్చిన ఈ మొబైల్ ఇటీవల విడుదలైన Y6t తర్వాత మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్‌లో కూడా అదే Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌ను ఉపయోగించడం గమనార్హం. ఈ కొత్త వివో Y6 5G కేవలం 8.39mm మందంతో, 219 గ్రాముల బరువుతో స్లిమ్ డిజైన్‌ను అందిస్తుంది. 6.57 అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్ 1570×720 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 1,200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్లు వీడియో స్ట్రీమింగ్, గేమింగ్‌ కు మంచి అనుభవాన్ని అందిస్తాయి.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో గరిష్టంగా 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. అయితే స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం లేదు. రోజువారీ వినియోగం, మల్టీటాస్కింగ్ కోసం ఇది సరిపడా పనితీరును అందిస్తుంది. ఫోటోగ్రఫీ విషయంలో Vivo Y6 5G సింపుల్ సెటప్‌తో వస్తుంది. వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా ఉండగా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఇవ్వబడింది. వీడియో కాల్స్, సోషల్ మీడియా కోసం ఇది సరిపోతుంది.

ఈ ఫోన్ ఆరిజిన్ OS 6 ఆధారంగా ఆండ్రాయిడ్ 16పై నడుస్తుంది. అయితే భవిష్యత్ సాఫ్ట్‌ వేర్ అప్‌డేట్స్‌ పై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ మొబైల్ కు సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్, IP68 & IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్లో 7,200mAh భారీ బ్యాటరీ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ. 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో త్వరగా చార్జ్ చేసుకోవచ్చు. చైనాలో ఈ ఫోన్ ఇప్పటికే విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సిల్వర్, గోల్డ్, బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదలపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

వీటి ధరలు ఇలా ఉన్నాయి:
* 8GB + 128GB వేరియంట్: CNY 1,799 ($263).
* 8GB + 256GB వేరియంట్: CNY 1,999 ($292).
* 12GB + 256GB వేరియంట్: CNY 2,199 ($322).