
మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ ఆఫీస్ లో ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో ఆమె భేటీ కావడంతో.. ప్రీతిరెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ ఊహాగానాలపై ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఈ భేటీపై ప్రీతిరెడ్డి క్లారిటీ ఇస్తూ.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కు ఆహ్వానించేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించా.. ఈ క్రమంలో తివారీని ఒక విద్యావేత్తగానే కలిశానని చెప్పారున . తాను బీజేపీలో చేరడం లేదు’ అని ఆమె తేల్చి చెప్పారు. కేవలం బీజేపీ నేతలనే కాకుండా, అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామని.. అందులో భాగంగానే మొన్న మంత్రి శ్రీధర్ బాబును కూడా కలిశామని గుర్తు చేశారు. మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని, తమకు ఆ పార్టీ అంటే ఎంతో గౌరవం ఉందని ఆమె అన్నారు. ఒక విద్యావేత్తగా అందరినీ కలిసి ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన ప్రీతిరెడ్డి.. దయచేసి తనపై వస్తున్న రాజకీయ ప్రచారాలకు స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేశారు.
ALSO READ : తెలంగాణలో మరో రెండురోజులు మస్తు ఎండలు..
మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల ప్రధాని మోదీని కూడా కలిశారు. దీంతో ఆమె బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఇవాళ చంద్రశేఖర్ తివారీని కలవడంతో మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఆమె బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు.