Reading Time: < 1 minute

కాళేశ్వరంపై సీఎం ఆధ్వర్యంలో సీబీఐ డైరెక్టర్ను కలుస్తాం: మంత్రి ఉత్తమ్

Caption of Image.

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీబీఐ డైరెక్టర్ ను కలుస్తామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విచారణ జరపాలని స్వయంగా కోరుతామని తెలిపారు. 9 నెలలు గడిచినా సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 2026 ఏప్రిల్ 23న జరిగిన కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చించినట్లు తెలిపారు.

కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్లు కారణం కాదని హైకోర్టు చెప్పలేదన్నారు మంత్రి. కమిషన్ ఏర్పాటును హైకోర్టు ఎక్కడా తప్పుపట్టలేదన్నారు. కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం కాదని హైకోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. రిపోర్టు ఆధారంగా వీళ్లపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోర్టు చెప్పిందని తెలిపారు. 

►ALSO READ | అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి రాహుల్ గాంధీకి వివరించా: పీసీసీ చీఫ్

బీఆర్ఎస్ ఎందుకు సంబరాలు చేసుకుంటుందో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు ఉత్తమ్. చిన్న విషయాన్ని కూడా తెలుసుకోకుండా సంబరాలా అని ప్రశ్నించారు. లీగల్ ఎక్స్ పర్ట్స్ తో భేటీ అయ్యాక తదుపరి చర్యలుంటాయన్నారు. కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోమని ముందే చెప్పినట్లు గుర్తు చేశారు.

©️ VIL Media Pvt Ltd.