Reading Time: < 1 minute

హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు గోపాలరావు మృతి

Caption of Image.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకులు గోపాలరావు మృతి చెందారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న ఆయన కుమారుడి నివాసంలో గురువారం ( ఏప్రిల్ 23 ) మృతి చెందారు గోపాలరావు. గోపాలరావు భౌతిక ఖాయాన్ని ఆదివారం ( ఏప్రిల్ 26 ) ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని తన ఇంట్లో మిత్రుల సందర్శనార్ధం ఉంచి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సోము గోపాలరావు 1986లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒకరు. తొలి పుస్తక ప్రదర్శనకు సమన్వయకర్తగా వ్యవహరించారు గోపాలరావు. సైంటిఫిక్ సర్వీసెస్ అనే సంస్థ ద్వారా వారు పుస్తక రంగానికి సేవలు అందించారు. అనేక పుస్తక ప్రదర్శనల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు గోపాలరావు. 

గోపాలరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు డా.కవి యాకూబ్, ఉపాధ్యక్షుడు మలుపు బాల్ రెడ్డి, బుక్ ఫెయిర్ కార్యదర్శి ఆర్.వాసు,కోశాధికారి నారాయణరెడ్డి. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేసారు.

©️ VIL Media Pvt Ltd.