Reading Time: 2 minutes
Lloyd 1 5 Ton Inverter Ac Deal Get Rs 22000 Discount On Split Ac On Amazon

Lloyd 1.5 Ton Inverter AC Deal: వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ కండీషనర్ కొనాలనుకునే వారికి బెస్ట్ ఎయిర్ కండీషనర్ వచ్చేసింది. అది కూడా భారీ ఆఫర్ తో. ప్రముఖ బ్రాండ్ లాయిడ్ (Lloyd) అందిస్తున్న 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC (మోడల్: GLS18I3FWGSC)పై అమెజాన్ లో భారీ డిస్కౌంట్ ఉంది.

ఈ ఏసీలో 6-in-1 కన్వర్టిబుల్ ఫీచర్ ఉండటం వల్ల అవసరాన్ని బట్టి కూలింగ్ సామర్థ్యాన్ని మార్చుకోవచ్చు. 52 డిగ్రీల వరకు కూడా సమర్థంగా పనిచేసే సామర్థ్యం దీని ప్రధాన ప్రత్యేకత. టర్బో కూల్ ఫీచర్ వల్ల గది త్వరగా చల్లబడుతుంది. ఈ మోడల్‌లో యాంటీ-వైరల్ ఫిల్టర్‌తో పాటు PM 2.5 డస్ట్ ఫిల్టర్ కూడా ఇవ్వబడింది. ఇవి గాల్లోని దుమ్ము, వైరస్‌లను ఫిల్టర్ చేసి శుభ్రమైన గాలిని అందిస్తాయి. క్లీన్ ఫిల్టర్ ఇండికేషన్ కూడా ఉండటంతో మెయింటెనెన్స్ సులభంగా ఉంటుంది.

Image (10)

ఇంకా ఇందులో 100% కాపర్ కాయిల్స్ ఉపయోగించడం వల్ల ఎక్కువ రోజులు బాగా పనితీరు లభిస్తుంది. గోల్డెన్ ఫిన్ ఎవాపరేటర్ ఉండటం వల్ల కరోషన్ సమస్యలు తక్కువగా ఉంటాయి. స్టెబిలైజర్ లేకుండానే పని చేసే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఈ ఏసీ కేవలం 32 డెసిబెల్స్ శబ్దంతో నిశ్శబ్దంగా పనిచేస్తుంది. 3 స్టార్ BEE రేటింగ్‌తో పాటు 3.84 SEER రేటింగ్ ఉండటం వల్ల పవర్ వినియోగం నియంత్రణలో ఉంటుంది.

ఇక ఈ ఏసీ అసలు ధర రూ. 53,990 ఉండగా… ప్రస్తుతం 42% తగ్గింపుతో కేవలం రూ. 31,490కే లభిస్తోంది. అంటే దాదాపు రూ. 22,500 వరకు ధర తగ్గడం విశేషం. ఈ డీల్‌పై బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI, క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ACపై ఒక సంవత్సరం ప్రొడక్ట్ వారంటీ, 5 సంవత్సరాల కాంపోనెంట్స్ వారంటీ, అలాగే 10 సంవత్సరాల కంప్రెసర్ వారంటీ అందిస్తున్నారు. రిమోట్ కంట్రోల్, ఇన్‌స్టాలేషన్ కిట్ వంటి అవసరమైన యాక్సెసరీలు కూడా ప్యాకేజీలో ఉంటాయి.