
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యక్తులలో ఒకరైన ఎంఎస్ ధోని, సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన చర్చనీయాంశమైంది. ఈ సంఘటన ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఒకానొక సందర్భంలో, ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు, ఎంఎస్ ధోని ఆయనను చూసి.. వచ్చి పలకరించారు. అయితే, రామ్‌గోపాల్ వర్మ ధోనిని గుర్తించలేకపోయారు. సినీ అవకాశాల కోసం తనను కలిసిన వ్యక్తిగా భావించిన వర్మ, ధోనికి తన విజిటింగ్ కార్డును ఇచ్చి, తమ ఆఫీసును సంప్రదించమని సూచించారు. ఈ పరిణామంపై ఎంఎస్ ధోని నవ్వుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనను గుర్తుపట్టబడకపోవడంపై ధోని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, బహుశా రామ్‌గోపాల్ వర్మ క్రికెట్ చూడరేమో అని అప్పట్లో భావించినట్లు తెలిసింది. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎన్నో విజయాలు అందించిన ధోనిని, సినీ రంగ ప్రముఖుడు గుర్తించకపోవడం ఆ సమయంలో పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ధోని జీవితంలో ఇలాంటి సంఘటన జరిగిందనే విషయం తెలిసి అభిమానులు సైతం విస్మయానికి లోనయ్యారు.
ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు తేజ ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తెలియజేశారు. కాగా తేజ కెరీర్ తొలి నాళ్లలో రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కాగా తేజ చివరిగా తీసిన అహింస అనే సినిమా.. 2023లో విడుదలైంది. ఆ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు.
Also Read: సావిత్రి చివరి రోజుల్లో కోమాలో అచేతనంగా ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క తెలుగు నటి ఎవరంటే..