Reading Time: < 1 minute
Arvind Kejriwal Reaction Raghav Chadha Bjp Aap Crisis

Arvind Kejriwal: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఆయన బీజేపీలో చేరడమే కాకుండా, రాజ్యసభలోని 10 మంది ఆప్ ఎంపీల్లో, ఏడుగురు ఎంపీలను బీజేపీలోకి తీసుకెళ్లారు. దీంతో ఆప్ రాజ్యసభ మొత్తం బీజేపీలో విలీనం అయింది. ఆప్ నుంచి బీజేపీలో చేరిని వారిలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ వంటి వారు కూడా ఉన్నారు.

Read Also: Shreyas Iyer: శ్రేయస్‌ అయ్యర్‌ విజయ రహస్యాన్ని బయట పెట్టిన పంజాబ్ ఆటగాడు..

ఇదిలా ఉంటే, రాఘవ్ చద్దా బీజేపీలోకి చేరిన తర్వాత ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కేవలం ఒకే లైన్‌లో తన స్పందన తెలియజేశారు. ‘‘బీజేపీ మరోసారి పంజాబ్‌ ప్రజలకు షాక్ ఇచ్చింది’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఆప్ నుంచి బీజేపీలో చేరిన వారిలో అశోక్ మిట్టర్, సందీప్ పాఠక్ ఉన్నారు.