Reading Time: < 1 minute
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పోలీసులే దొంగలయ్యారు. ఓ కేసు విచారణలో నగల వ్యాపారి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఇంట్లోకి చొరబడి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 20 తులాల బంగారాన్ని చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఇండోర్‌లో ఒక ఇంట్లోకి చొరబడి, ఓనర్స్ తో దురుసుగా ప్రవర్తించి, బంగారు ఆభరణాలను దొంగిలించిన ఆరోపణలపై ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. బాధితుడి ఫిర్యాదుతో విచారణ చేపట్టి.. నిజానిజాలు నిగ్గు తేల్చారు. ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఇండోర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కుమార్ ప్రతీక్ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి ఆరుగురు పోలీసులు చెక్ బౌన్స్ కేసులో గౌరవ్ జైన్ అనే బంగారం వ్యాపారి ఇంటికి వెళ్లారు. తలుపులు పగలగొట్టి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి, ఇంట్లోని వారితో దురుసుగా ప్రవర్తించారు. తనిఖీల పేరిట ఇంట్లో చెక్ చేసిన పోలీసులు 20 తులాల బంగారాన్ని చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ జరిపారు. ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు డీసీపీ తెలిపారు.ఈ కేసులో లసూడియా స్టేషన్ హౌస్ ఆఫీసర్ పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోంది. అతని ప్రమేయం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని డీసీపీ కుమార్ అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఐదుగురు పోలీసులు బంగారం వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డారు. సుమారు రూ. 35 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నగలు చోరీ చేసిన వారిలో అదనపు పోలీస్ కమిషనర్ సింగ్, సబ్-ఇన్‌స్పెక్టర్ సంజయ్ , హెడ్ కానిస్టేబుళ్లు ప్రవీణ్, దినేష్, రవీంద్ర ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సారీ హేమక్కా.. తప్పు చేశాను.. తమన్నా క్షమాపణ వైరల్ వీడియో

పది రూపాయల స్నాక్‌.. పది కోట్ల వ్యూస్‌

Allu Aravind: బన్నీ అలా ఎందుకు చేస్తాడు..? మీరు విన్నది తప్పు – అరవింద్

రోజా కూతురికి ‘Herman B Wells’ అవార్డ్‌.. గర్వంతో పొంగిపోయిన రోజా

గుంతల రోడ్లతో చికాకు.. పోర్షే కారుపైనే సిమెంట్ కలిపిన యువకుడు..