Reading Time: < 1 minute

నర్సంపేట బస్టాండ్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Caption of Image.

నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్ (651568) ఆత్మహత్యకు యత్నించాడు. బస్టాండ్లోనే డ్రైవర్ శంకర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న ఘటన కలకలం రేపింది. తోటి కార్మికులు మంటలు ఆర్పి బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణా, ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టారు.

ప్రజా రవాణా స్తంభించకుండా 2,700 అద్దె బస్సులను, మరో 1,000 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా అన్ని జిల్లాల నుంచి ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడిపేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆర్టీఏ అధికారులను రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు తగిన ఆదేశాలు జారీ చేశారు. ముందు జాగ్ర త్త చర్యగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద, బస్సు స్టేషన్ల వద్ద అర్ధరాత్రి నుంచే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

►ALSO READ | ఆస్పత్రిలో ఆపరేషన్ చేస్తూ.. చేస్తూ గుండెపోటుతో డాక్టర్ మృతి : నిర్మల్ జిల్లాలో ఊహించని ఘటన

©️ VIL Media Pvt Ltd.