Reading Time: < 1 minute
Up Moradabad Husband Kills Wife Over Gym Dispute

Shocking: భార్య జిమ్‌కు వెళ్తోందని కలత చెందిన ఒక భర్త దారుణహత్యకు పాల్పడ్డాడు. జిమ్ ట్రైనర్ల ప్రవర్తన అనుచితంగా ఉందని భావించిన భర్త ఈ దారుణానికి ఒడిగట్టారు. భార్య జిమ్‌కు వెళ్లడంపై చాలా కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్‌లో జరిగింది. పోలీసులు ఈ హత్యకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.

స్క్రాప్ డీలర్ అయిన శోభిత్ గుప్తా, తన ఇంట్లో తన భార్య పూనమ్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పదేళ్ల క్రితం ఈ జంటకు వివాహం కాగా, ఏడేళ్ల కుమార్తె ఉంది. పూనమ్ జిమ్‌కు వెళ్లడంపై వీరిద్దరి మధ్య తరుచుగా వాగ్వాదం జరిగేదని పోలీసులు చెప్పారు. బుధవారం ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో శోభిత్ ఇనుప రాడ్‌తో తన భార్య తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది.

Read Also: Raghav Chadha: ఆప్‌కు రాఘవ్ చద్దా భారీ షాక్.. ఏకంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి..

హత్య తర్వాత నిందితుడు దాదాపు 7 గంటలు శవం పక్కనే కూర్చుని, హత్యను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. తన భార్య కిందపడి గాయపడినట్లు అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అయితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు విషయాన్ని రాబట్టారు.

పోలీస్ విచారణలో నిందితుడు చెప్పిన విషయాలు షాక్‌కు గురిచేశాయి. తన భార్య ప్రవర్తనపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని, అయితే జిమ్ వాతావరణం పట్ల తాను అభద్రతకు గురవుతున్నట్లు చెప్పాడు. జిమ్ ట్రైనర్లు మహిళల్ని చెడు ఉద్దేశ్యంతో చూస్తారని, వారిని ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారని చెప్పాడు. ఈ అనుమానమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు.