Reading Time: < 1 minute
Telangana: నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. వరంగల్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా..

రెండ్రోజులకే ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన కార్మికులు… ప్రాణాలు తీసుకొనేందుకూ వెనుకాడట్లేదు నర్సంపేట బస్‌ డిపోలో డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. MGMలో చికిత్స అనంతరం.. మెరుగైన చికిత్స కోసం శంకర్‌గౌడ్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మరణించారు.