Reading Time: 2 minutes

SRH Captain: సన్‌రైజర్స్‌లోకి ప్యాట్ కమిన్స్.. కెప్టెన్సీ మార్పుపై SRH కన్‌ఫ్యూజన్

Caption of Image.

SRH Captain: ఐపీఎల్ 2026 ఎడిషన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడుతుంది. వరుసగా 3 విజయాలతో పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. కానీ జట్టు విజయాలతో ముందుకు సాగుతున్న తరుణంలో కెప్టెన్సీకి సంబంధించి ఓ పెద్ద చర్చ స్టార్ట్ అయింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టుతో చేరడంతో ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న ఇషాన్ కిషన్ నుంచి బాధ్యతలు తప్పుకునే ఛాన్స్ ఉందనేది.. అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ ఆరంభంలో ప్యాట్ కమిన్స్ గాయంతో అందుబాటులో లేకపోవడంతో జట్టు యాజమాన్యం అనూహ్యంగా యువ ప్లేయర్ ఇషాన్ కిషన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఆరంభంలో కొన్ని ఓటములు ఎదురైనప్పటికీ.. ఇషాన్ తన నాయకత్వ పటిమతో జట్టుకి మళ్లీ విజయాలు అందించాడు. ముఖ్యంగా బౌలర్లను ఉపయోగించుకోవడంతో పాటు ఫీల్డింగ్ సెట్ చేయడంలో కిషన్ చూపిన పరిణతి చూస్తున్నాడు.  

ఇషాన్ కిషన్ కెప్టెన్సీని కొనసాగించాలని మాజీ క్రికెటర్లు గట్టిగా వాదిస్తున్నారు. హైదరాబాద్ జట్టు ప్యాట్ కమిన్స్ వైపు వెళ్లాలనే ఆలోచన చేయొద్దని సూచించారు. ప్రస్తుత సెటప్‌లో ఇషాన్ సారథ్యంలో జట్టు చాలా సమతుల్యంగా కనపడుతుంది. గత 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచిన టీమ్ లో మార్పులు చేయడం అనవసరం అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ప్యాట్ కమిన్స్ 2024లో జట్టును ఫైనల్‌కు చేర్చినప్పటికీ.. ప్రస్తుత ఫామ్ ఇషాన్‌కు అనుకూలంగా ఉందన్నాడు.  

►ALSO READ | CSKలోకి డెత్ ఓవర్ స్పెషలిస్ట్.. ఆయూష్ మాత్రే స్థానంలో MI ప్లేయర్ 

మాజీ కోచ్ సంజయ్ బంగర్ కూడా ఇషాన్ కిషన్ కి సపోర్టు చేశాడు. ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్నాడని.. దీనివల్ల అతను గత టీ20 ప్రపంచ కప్‌కు కూడా దూరంగా ఉన్నాడని గుర్తు చేశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కమిన్స్.. ఐపీఎల్ లాంటి సుదీర్ఘ టోర్నీలో పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉంటాడా అన్నది అనుమానమేనని సంజయ్ పేర్కొన్నారు. ఇషాన్ కిషన్ గ్రౌండ్లో ఆటను నియంత్రించే తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఇప్పుడు కన్‌ఫ్యూజన్ లో పడింది. ఓ వైపు ప్యాట్ కమిన్స్ అందుబాటులోకి రావడం.. మరోవైపు వరుస విజయాలతో జోరు మీదున్న యంగ్ కెప్టెన్ ఇషాన్ కిషన్.. ఎవరినీ కెప్టెన్సీగా ఉంచాలనే నిర్ణయంపై మదనపడుతుంది. మరి ఆరెంజ్ ఆర్మీ అనుభవానికి ఓటేస్తుందో లేక విజయం తెచ్చిపెడుతున్న యువ రక్తాన్ని నమ్ముతుందా అనేది వేచి చూడాలి.

©️ VIL Media Pvt Ltd.