Reading Time: 2 minutes
నాకు తెలిసినవాళ్లే అలా చేయడంతో చాలా బాధపడ్డా..! చక్రి చివరి ఇంటర్వ్యూ వింటే కన్నీళ్లు ఆగవు

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ను అందించారు చక్రి. యూత్ ను ఉర్రుతలూగించింది చక్రి సంగీతం.. ఎన్నో సినిమాలను తన సంగీతంతో నిలబెట్టారు చక్రి. తన సంగీతంలో సినీ ఇండస్ట్రీలో రాణించిన చక్రి.. 80కి పైగా సినిమాలకు బాణీలు అందించారు. అలాగే అద్బుతమైన పాటలను కూడా ఆలపించారు. కాగా చిన్న వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశారు చక్రి. కాగా చక్రి చనిపోక ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. చక్రి చివరిగా ప్రముఖ ఛానెల్ ఈటీవీ ఝుమ్మంది నాదం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అద్భుతమైన సినీ ప్రయాణాన్నిపంచుకున్నారు.

ఇది కూడా చదవండి : గుండు వెనక అసలు కారణం ఇదే.. కన్నీళ్లు పెట్టిస్తున్న రమణ గోగుల ఎమోషనల్ స్టోరీ

వరంగల్ జిల్లా మహబూబాబాద్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన చక్రి, సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. కేవలం 16 సంవత్సరాల వయస్సులో సినిమా రంగంలోకి అడుగుపెట్టి, తన సంగీత దర్శకత్వంతో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు ప్రాణం పోశారు. వందేమాతరం ఆల్బమ్‌తో మొదలైన ఆయన ప్రయాణం, 2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్ గారి పరిచయంతో బాచి సినిమాతో సినీ పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. బాచి సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో, అక్కడి నుంచి ఆయన కెరీర్ నిరాఘాటంగా ముందుకు సాగింది. చక్రి తన విజయానికి స్నేహితులు, ముఖ్యంగా పూరి జగన్నాథ్ కి రుణపడి ఉన్నానని కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి : చూసుకోవాలికదమ్మా..!! అడ్డంగా దొరికిపోయిన సింగర్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఆయన మాట్లాడుతూ.. నాకు సినిమా అవకాశాలు రానప్పుడు కూడా నేను పెద్ద హీరోలు, దర్శకులను వెళ్లి కలవడం నాకు అవకాశాలు ఇవ్వండి అని అడగడం చేయలేదు అని తెలిపారు. కానీ నాకు తెలిసిన దర్శకులు, ప్రొడ్యూసర్లు కూడా నాకు అవకాశాలు ఇవ్వకపోవడంతో బాధపడ్డాను. నాతో పని చేసి హిట్స్ అందుకున్న తర్వాత నెక్స్ట్ సినిమాకు వేరే వాళ్లను తీసుకున్నారు అప్పుడు చాలా బాధపడ్డాను. అంతే కానీ నేను ఎప్పుడూ ఎవరి వెంట పడలేదు. బహుశా అదే నేను చేసిన మిస్టేక్ అయ్యుంటుంది అని అన్నారు చక్రి. కొంతమంది దర్శకులు నాతో చిన్న సినిమాలు చేయడం మానేసేయ్ అన్నారు. చిన్న సినిమాలు మానేస్తే సర్వైవల్ ప్రోబ్లం వస్తుంది. పెద్ద సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి.. ఈ వెయిటింగ్ వరకు చేయాలి.. అప్పటివరకు సంపాదన రాదు అందుకని తప్పని సరి పరిస్థితుల్లో చేసేవాడిని.. సింహం సినిమా పెద్ద హిట్ అయ్యింది.. నంది అవార్డు కూడా వచ్చింది. అమ్మయ్య తిరిగి సినిమాలు వస్తాయి అనుకున్నా కానీ పెద్ద సినిమా ఆఫర్స్ రాలేదు చిన్న సినిమాలే దిక్కు అయ్యాయి. బోలెడంత కసి, చేయగలను అనే నమ్మకం ఉంది.. ట్వీయిలో ఒక పాట వస్తుంటే నేనైతే ఇంకా బాగా చేసేవాడిని అని అనుకునేవాడిని.. చేసే సత్తా ఉన్నా అవకాశాలు రాకపోతే అది చెప్పలేని బాధ కలిగించింది అంటూ చక్రి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.