Reading Time: 2 minutes
Rajinikanth Voting Privacy Row Tamil Nadu Election 2026 Celebrities Cast Votes

Rajinikanth Voting Privacy: తమిళనాడులోని 234 స్థానాలకు గానూ ఏప్రిల్ 23 గురువారం పోలింగ్ జరుగుతోంది. మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లో 152 స్థానాలకు మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఇంతలో ప్రధాని మోడీ ప్రతిఒక్కరూ ఉత్సాహంగా అధిక సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక తమిళనాడులో సాధారణ ప్రజలతో పాటు, రజనీకాంత్, శివకుమార్, విజయ్, ధ్రువ్, విక్రమ్, కమల్ హాసన్, శృతి హాసన్, అజిత్ వంటి అనేక మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ జరిగిన సంఘటన అత్యంత దారుణంగా ఉంది. ‘తలైవా’ తన ఓటు వేయడానికి వచ్చినప్పుడు.. కెమెరాలు ఆయనను చుట్టు ముట్టాయి. ఈ పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రజనీకాంత్ ఓటు వేయడానికి వచ్చిన సమయంలో మీడియా, ఫోటోగ్రాఫర్ల తాకిడి విపరీతంగా పెరిగింది. ఈ తోపులాటలో కెమెరాలు ఆయనకు చాలా దగ్గరగా వెళ్లడంతో ఎవరికి ఓటు వేశారనే విషయం రికార్డ్ అయి వైరల్‌గా మారింది. ఓటు వేయడం అనేది అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రక్రియ (Right to Privacy). కానీ కెమెరాలు ఏకంగా ఓటింగ్ మెషీన్ వరకు వెళ్లడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సామాన్య ప్రజలు మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లడానికి అనుమతి లేని చోట, మీడియాకు ఇంత స్వేచ్ఛ ఎలా ఇచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారు. రజనీ ఓటు వేస్తున్న సమయంలో పక్కనే ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. అంతేకాదు.. సడెన్‌గా అక్కడికి మహిళా చీఫ్ పోలింగ్ ఆఫీసర్ రావడం, ఆమె ఈవీఎం వైపునకు చూడటంపై విమర్శలు వస్తున్నాయి. ఆ అధికారికి అక్కడికి వెళ్లమని ఎవరు ఆదేశించారని నెటిజన్లు నిలదీస్తున్నారు.

మరోవైపు, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శ్రుతి హాసన్‌తో కలిసి అల్వార్‌పేటలోని పాఠశాలలో ఓటు వేశారు. సామాన్యుడిలా ఆయన క్యూలైన్‌లో నిలబడి ఓటు వేయడం అందరినీ ఆకట్టుకుంది. సీనియర్ నటుడు శివకుమార్ (సూర్య, కార్తీల తండ్రి) ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. “రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TASMAC) అంటే మద్యం అమ్మకాలను రద్దు చేయడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. యువత భవిష్యత్తును నాశనం చేసే నీతులు అవలంబించడం సరికాదు. కేవలం కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టడమే లక్ష్యంగా పాలన సాగించడం అంగీకారయోగ్యం కాదు.” అని ఘాటుగా స్పందించారు.