Reading Time: < 1 minute

కేబినెట్ భేటీ: ఆర్టీసీ సమ్మెపై మంత్రుల కీలక ప్రకటన

Caption of Image.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. అజెండాలో ఆర్టీసీ సమ్మె కీలక అంశంగా చర్చించినట్లు కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు తెలిపారు. శుక్రవారం (ఏప్రిల్ 24) ఆర్టీసీ కార్మికులతో చర్చ జరపాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  నేతృత్వంలోలో చర్చలు ఉంటాయన్నారు. 

మంత్రి పొన్నం కామెంట్స్:

  • యూనియన్ నేతలతో చర్చలు జరపాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.
  • 2014 నుంచి 2023 వరకు ఉన్న పరిస్థితి.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించాలి.
  • పీఆర్సీ కావొచ్చు.. విలీనం కావొచ్చు.. ఇది అధికారుల కమిటీ చెప్పాల్సి ఉంది.
  • కార్మికులు ఎవరూ తొందర పడొద్దు..
  • కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం  ప్రభుత్వం సానుకూలంగా ఉంది.
  • ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వలన ఎలాంటి ఉద్యోగాలు తీసేసే ప్రసక్తే లేదు.
  • కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది..

మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్:

  • కేబినెట్ లో ఆర్టీసీ సమ్మె గురించి చర్చించాం
  • కార్మికులు సంయమనం పాటించాలి
  • వెంటనే చర్చలకు ముందుకు రావాలి
  • తెలంగాణ రాష్ట్రం సాధించడంలో మీది పెద్ద పాత్ర.. 
  • ఇది మీ ప్రభుత్వం.. సమస్యలు పరిష్కరిస్తాం
  • కార్మికులు.. మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దు
  • క్షణికావేశంతో ఫ్యామిలీలను రోడ్డున పడేయొద్దు
  • కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
  • చర్చలకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం

మంత్రి దామోదర:

  • మా ప్రభుత్వానికి కమిట్ మెంట్ ఉంది
  • కేబినెట్ అజెండాలో మీ అంశం ఉంది.
  • ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం
  • కేబినెట్ మొత్తం విజ్ఞప్తి చేస్తోంది
  • కార్మికులు చర్చలకు రావాలి
  • డిప్యూటీ సీఎం నేతృత్వంలో చర్చలుంటాయి
©️ VIL Media Pvt Ltd.