
న్యూఢిల్లీ: ఢిల్లీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఏడుగురు ఆప్ రాజ్య సభ ఎంపీలు బీజేపీలో చేరారు. రాఘవ్ చద్దా, స్వాతి మలివాల్ వంటి కీలక నేతలు ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆప్ ఎంపీల ఫిరాయింపులపై ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు. బీజేపీ మరోసారి పంజాబీలకు ద్రోహం చేసిందని విమర్శించారు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఆపరేషన్ లోటస్ మరోసారి ప్రారంభించిందన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి బీజేపీ తమ పార్టీ ఎంపీలను ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించారు. మూడు రోజుల క్రితం అశోక్ మిట్టల్ ఇంటిపై ఈడీ దాడి జరగగా.. ఇవాళ ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు.
ALSO READ : రాజ్యసభలో ఆప్ ఖాళీ: ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి జంప్..!
బీజేపీలో చేరబోతున్న ఏడుగురు ఎంపీల కోసం ఆప్ ఎన్నో చేసింది. పంజాబ్ ప్రజలు వారిపై ఎంతో ప్రేమను చూపించారు. వారిని రాజ్యసభకు పంపారు. అయినా వీరు బీజేపీ ట్రాప్లో పడిపోయారు. పంజాబ్ ప్రజలు ఈ ద్రోహులను క్షమించరు’’ అని సంజయ్ సింగ్ విమర్శించారు. పంజాబ్లో భగంత్ మాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని పంజాబ్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు.