Reading Time: 2 minutes
Mutual Fund: నెలకు రూ.1,000తో కోటీశ్వరులు కావొచ్చా? ఈ మ్యూచువల్ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ చూస్తే షాక్ అవుతారు!

Mutual Fund: సాధారణంగా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అనగానే అందరికీ పరాగ్ పారిఖ్ లేదా హెచ్‌డిఎఫ్‌సి ఫండ్స్ గుర్తొస్తాయి. కానీ, గత 32 ఏళ్లుగా నిశ్శబ్దంగా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న ఫండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. 1994లో ప్రారంభమైన ఈ ఫండ్, నేడు ఇన్వెస్టర్ల పాలిట కల్పవృక్షంలా మారింది. ఈ ఫండ్ ప్రారంభం (సెప్టెంబర్ 29, 1994) నుండి ఇప్పటివరకు అందించిన రిటర్న్స్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

SIP మ్యాజిక్: ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుండి నెలకు కేవలం రూ.1,000 చొప్పున SIP చేసినా, దాని విలువ నేడు సుమారు రూ.1.7 కోట్లు అయ్యేది. ఒకవేళ నెలకు రూ.2,000 పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు అది రూ.3.38 కోట్లుగా మారి ఉండేది. (వార్షిక రిటర్న్: 19.22%).

లంప్‌సమ్ (Lump sum): ప్రారంభంలో లక్ష రూపాయలు ఒకేసారి ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేడు దాని విలువ రూ.1.62 కోట్లు పైమాటే. అంటే పెట్టుబడి 160 రెట్లు పెరిగింది (వార్షిక రిటర్న్: 17.58%).

ఫండ్ నిర్వహణ, పోర్ట్‌ఫోలియో: AUM: మార్చి 31, 2026 నాటికి ఈ ఫండ్ మొత్తం రూ.19,598 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది.మార్చి 31, 2026 నాటికి ఈ ఫండ్ మొత్తం రూ.19,598 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది.

ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు?:

ఈ ఫండ్ ప్రధానంగా బ్యాంకింగ్ రంగంపై నమ్మకం ఉంచింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి దిగ్గజాల్లో పెట్టుబడులు ఉన్నాయి. వీటితో పాటు ఎల్‌అండ్‌టీ, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్ వంటి కంపెనీల్లో కూడా వాటాలు ఉన్నాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కావడం వల్ల ఇది మార్కెట్ పరిస్థితులను బట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడులను మారుస్తూ ఉంటుంది.

ఇది కూడా చదవండి: Petrol: వాహనదారులకు షాకింగ్‌ న్యూస్‌.. ఇక ఆ సర్టిఫికేట్‌ ఉంటేనే బంకుల్లో పెట్రోల్‌.. లేకుంటే వెనుదిరగాల్సిందే!

ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు?

దీర్ఘకాలంలో (కనీసం 10-15 ఏళ్లు) సంపదను సృష్టించాలనుకునే వారికి, మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోగల సామర్థ్యం ఉన్నవారికి ఇది ఒక మంచి ఎంపిక. దీనికి వాల్యూ రీసెర్చ్ నుండి 4-స్టార్ రేటింగ్ కూడా లభించింది.

ఇది కూడా చదవండి: Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు చేస్తే మీ ఆర్థిక పరిస్థితి తలకిందులవ్వడం ఖాయం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి