
కుమార్గంజ్: పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. దక్షిణ దినాజ్పూర్ జిల్లాలోని కుమార్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిపై టీఎంసీ కార్యకర్తలు వెంటాడి మరీ దాడి చేశారు. వారి నుంచి తప్పించుకోవడానికి బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్ పొలాల్లో పరిగెత్తాల్సి వచ్చింది.
VIDEO | West Bengal election: BJP candidate from South Dinajpur manhandled allegedly by TMC workers even as a security person tries to protect him. #AssemblyPollsWithPTI #WestBengalPollsWithPTI
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/NeCAxYA08p
— Press Trust of India (@PTI_News) April 23, 2026
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్‌లోని కుమార్‌గంజ్‌లో పోలింగ్ జరుగుతుండగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడ రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ ఒక బూత్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై టీఎంసీ మద్దతుదారులు దాడి చేసి కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. తన పోలింగ్ ఏజెంట్‌ను బూత్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి ఒక వ్యక్తిని వెంబడించారు.
►ALSO READ | ఇలా ఉన్నారేంట్రా.. చీర బదులు నైటీ ధరించిందని భార్యకు నిప్పంటించేశాడు !
దీంతో.. ఆ వ్యక్తికి మద్దతుగా వచ్చిన ఒక గుంపు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడికి తెగబడింది. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు పశ్చిమ బెంగాల్లో తొలి దశ పోలింగ్ ఉద్రిక్తతలకు కేరాఫ్గా నిలిచింది. ముర్షిదాబాద్‌లోని నౌదాలో దుండగులు నాటు బాంబులు విసిరడంతో ఆ ప్రాంతంలో కల్లోలం రేగింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. టీఎంసీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారు.