Reading Time: < 1 minute

సింగరేణి  సీఆర్టీలకు 12 నెలల వేతనం ఇవ్వాలె : సీఎండీని కోరిన ఎమ్మెల్సీ పింగళి

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: సింగరేణి విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు (సీఆర్టీలు) 12 నెలల వేతనాలు చెల్లించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతిని కలిసి వినతిపత్రం అందజేశారు. సింగరేణి స్కూళ్లలో అత్యల్ప వేతనంతో పని చేస్తున్న సీఆర్టీలకు కేవలం 10 నెలలు మాత్రమే జీతం ఇస్తున్నారని, దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై సీఎండీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీఆర్టీలను వెంటనే విధుల్లోకి తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేస్తామని, 12 నెలల వేతనంతోపాటు కనీస వేతనం అమలుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. 

©️ VIL Media Pvt Ltd.