
- సబితా ఇంద్రారెడ్డి
ఎల్బీనగర్, వెలుగు: పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్వాగతించారు. గురువారం బాలాపూల్లోని తన క్యాంపు ఆఫీస్లో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న రాజకీయ కక్షసాధింపులకు ఈ తీర్పు గట్టి చెంపపెట్టు అని అభివర్ణించారు. ఇప్పటికైనా రాజకీయ కుట్రలను పక్కనపెట్టి రైతుల సమస్యలపై దృష్టి సారించాలని, మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న పిల్లర్లను వెంటనే బాగు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.