
Viral Video: అమెరికా, ఇరాన్ యుద్ధంలో ‘‘హార్ముజ్ జలసంధి’’ కీలకంగా మారింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో 20 శాతం ఈ ఇరుకైన జలమార్గం గుండానే జరుగుతోంది. ఇప్పుడు ఈ మార్గాన్ని ఇరాన్ దిగ్బంధించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదిలా ఉంటే, హార్ముజ్ జలసంధి గుండా భారత్ వస్తున్న ఒక నౌకను ఇరాన్ కమాండోలు సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరాన్ కమాండోలు నౌక ఎలా ఎక్కుతున్నారు, ఎలా సీజ్ చేస్తు్న్నారనే ఫుటేజ్ ఈ వీడియోలో ఉంది.
Read Also: Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
బుధవారం, ట్రంప్ కాల్పుల విరమణ పొడగించిన కొన్ని గంటల తర్వాత పనామా జెండా కలిగిన MSC ఫ్రాన్సెస్కా, లైబీరియా జెండా కలిగిన ఎపామినోండాస్ అనే రెండు నౌకలపై ఇరాన్ కమాండోలు దాడి చేసి సీజ్ చేశారు. వీటిలో ఎపమినోండాస్ నౌక దుబాయ్ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వస్తోంది.
స్పీడ్ బోట్లలో వచ్చిన ముసుగు ధరించిన కమాండోలు ఓడలోకి ప్రవేశించి, రైఫిళ్లను చూపుతూ నౌకను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు చేస్తూ ఇంజన్ రూంలోకి ప్రవేశిస్తుండటం వీడియోలో చూడొచ్చు. అయితే, ఇందులోని సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. నౌకను ఇరాన్ తీరానికి తీసుకెళ్లారు. సీజ్ చేసిన కార్గో షిప్‌లకు సరైన అనుమతి లేదని, అవి నావిగేషన్ వ్యవస్థల్ని తారుమారు చేశాయని, సముద్ర భద్రతకు ప్రమాదం కలిగించారని ఇరాన్ భద్రతా బలగాలు వెల్లడించాయి.
Humiliation ultra pro max: Iran has released a video of its forces seizing the India-bound ship EPAMINONDAS. The ship was supposed to arrive at Mundra port in Modi ji’s gaon Gujarat but ended its journey at the Iranian coast instead. pic.twitter.com/zp3kesv9A0
— The Blank Page Official (@PageBlank) April 22, 2026