
బన్నీ గత పుట్టిన రోజుకు అట్లీ మూవీని ఎనౌన్స్ చేశాడు. ఈ ఏడాది పుట్టిన రోజుకు ఆ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేశాడు. నెక్ట్స్ ఇయర్ బర్త్ డేకైనా మూవీ రిలీజ్ అవుతుందే లేదో తెలియదు కానీ.. ఐకాన్ స్టార్ మాత్రం రాకా తర్వాత భారీ లైనప్ రెడీ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ లోకేశ్ కనగరాజ్‌తో 23 వెంచర్ సెట్ చేసిన బన్నీ.. మలయాళ హీరో కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ కూడా క్యూలో ఉన్నట్లు బజ్.
అట్లీ- బన్నీ మూవీ రాకా పట్టాలెక్కి దాదాపు ఏడాది కావొస్తున్నా ఇంకా షూటింగ్ 50 శాతమే ఫినీష్ చేసుకుంది. మిగిలిన షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్న డైరెక్టర్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అప్పుడే ఫోకస్ స్టార్ట్ చేసేస్తున్నాడట. రాకా తర్వాత షారూఖ్ ఖాన్‌తో అట్లీ రీ యూనియన్ కాబోతున్నాడని నార్త్ మీడియా అంటోంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన జవాన్ భారీ బ్లాక్ బస్టర్ నమోదు కావడంతో కింగ్ ఖాన్ అట్లీకి మరో ఛాన్స్ ఇచ్చాడట. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. షారూఖ్ ఖాన్‌కు జవాన్ స్పెషల్ మూవీ. ఈ సినిమా రూ. 1100 కోట్లు వసూలు చేసి కింగ్ ఖాన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలవడంతో పాటు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు బాలీవుడ్ దర్శకులకు చేతకాని పని అట్లీకి సాధ్యంకావడంతో ఈ సౌత్ దర్శకుడి వైపు టర్న్ అవుతున్నాడు షారూక్. కింగ్ మూవీ కంప్లీట్ కాగానే జవాన్2కి షిఫ్ట్ అవుతాడట. ఇప్పటికే బాద్ షా- అట్లీ స్క్రిప్ట్ లాక్ చేశాడని టాక్.పూర్తి స్క్రిప్ట్ వండి వార్చబోతున్నాడట అట్లీ. ఇక ఈ సినిమాలో యాంటోగనిస్టుగా మరోసారి సౌత్ స్టార్ హీరో కనిపించబోతున్నాడన్నది లేటెస్ట్ బజ్.