Reading Time: < 1 minute

బెంగాల్ లో గెలిచేది బీజేపీనే..మే 4న స్వీట్లు, జల్మూరి పంచుతాం: ప్రధాని మోదీ

Caption of Image.

పశ్చిమబెంగాల్ లో  కమలం వికసించడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణానగర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మోదీ తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు. మే 4వ తేదీన బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ విజయోత్సవాలు జరుగుతాయి. ఆ రోజున స్వీట్లు పంచుకుంటాం.. జల్మురి కూడా పంచుతాం అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ లక్ష్యంగా వ్యంగ్య బాణాలు విసిరారు ప్రధాని. నేను జల్మురి తిన్నాను కానీ.. దాని దెబ్బ మాత్రం టీఎంసీకే తగిలింది అంటూ  సెటైర్ చేశారు. జల్మురి పేరు వింటేనే కొంతమందికి గట్టి షాక్ తగులుతోందని ఆయన చమత్కరించారు.

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో తొలిదశ పోలింగ్ జరుగుతున్న వేళ ఓటర్లకు పిలుపునిచ్చారు మోదీ. రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగాలని కోరారు. గత ఐదు దశాబ్దాల తన రాజకీయ ప్రస్థానంలో.. ఈ ఎన్నికల్లోనే అత్యంత తక్కువ హింస నమోదైందని ఇది బెంగాల్ ఎన్నికల వాతావరణంలో ఒక శుభపరిణామమని ఆయన అభివర్ణించారు.

తొలి విడతలో భాగంగా  పశ్చిమబెంగాల్ లో  ఏప్రిల్ 23న 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.