Reading Time: 1 minute

కాసేపట్లో MI vs CSK  హైవోల్టెజ్ పోరు.. ఈరోజు గెలిచేది మాత్రం పక్కా ఆ జట్టే!

Caption of Image.

MI vs CSK: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లుగా పేరుగాంచిన ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగే ఉత్కంఠ పోరులో కాసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. అభిమానులు ‘ఎల్-క్లాసికో’గా పిలుచుకునే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు జట్లు పాయింట్ల పట్టికలో దిగువన ఉన్నప్పటికీ, ఈ మ్యాచ్ క్రేజ్ మాత్రం భారీగా ఉంది.  

పిచ్ రిపోర్ట్: 
వాంఖడే స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు బాగా సహకరిస్తుంది. మ్యాచ్ ప్రారంభంలో కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉంది. కానీ బంతి పాతబడే కొద్దీ స్పిన్నర్లు కొంత ప్రభావం చూపవచ్చు. ఈ పిచ్ పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే వాంఖడే స్టేడియంలో ఛేజింగ్ చేయడం సులభం కాబట్టి, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకుని, లక్ష్యాన్ని ఛేదించాలని చూస్తుంది. టాస్ గెలిచిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎవరు గెలుస్తారంటే?: 
సొంత మైదానంలో ఆడుతుండటంతో పాటు గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 99 పరుగుల భారీ విజయం సాధించడంతో ముంబై ఇండియన్స్ (MI) ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ టాస్ గెలిస్తే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ పుంజుకుని ముంబైకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తుది జట్ల అంచనా:
ముంబై ఇండియన్స్: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), డానిష్ మలేవార్, నమన్ ధీర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్రిష్ భరత్, మిచెల్ సాంట్నర్, విల్ జాక్స్, జస్ప్రీత్ బుమ్రా.
(ఇంపాక్ట్ ప్లేయర్: అశ్విని కుమార్)

చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్.
ఇంపాక్ట్ ప్లేయర్: గుర్జపనీత్ సింగ్
 

©️ VIL Media Pvt Ltd.