Reading Time: 2 minutes
Pm Modi Hooghly River Boat Ride Kolkata Roadshow West Bengal Election

ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. రెండో దశలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో మోడీ ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం పలు ప్రాంతాల్లో మోడీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Pmmodi

ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం హౌరా నుంచి కోల్‌కతా వరకు సుదీర్ఘ రోడ్‌షో నిర్వహించారు. హౌరా వంతెనపై కలియ తిరిగారు. ఇక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం హుగ్లీ నదిలో విహరించారు. బోటుపై తిరుగుతూ దృశ్యాలను స్వయంగా కెమెరాలో బంధించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోడీ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడతగా గురువారం 152 స్థానాల్లో పోలింగ్ జరిగింది. భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే ఎక్కువగా పది శాతం పెరిగింది. గురువారం దాదాపు 92.88 శాతం పోలింగ్ నమోదైంది. ఇక రెండో విడతలో భాగంగా 142 స్థానాలకు ఈనెల 29న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.