
సమ్మె కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు టీజీఎస్ఆర్టీసీ సంస్థ తక్షణ చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సులను నడిపేందుకు తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్, కండక్టర్ పోస్టులకు నియామకాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 2026 ఏప్రిల్ 23న సికింద్రాబాద్ పరిధిలోని 12 డిపోలలో తాల్కాలిక ప్రాతిపదికన కండక్టర్, డ్రైవర్ల నియామాకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కండక్టర్లుగా పనిచేసేందుకు 10 వ తరగతి పాసై ఉండాలి. డ్రైవర్ పోస్టులకు హెవీ వెహికల్ లైసెన్సు ఉన్న వారు అర్హులు. కనీసం 18 నెలలు హెవీ వెహికిల్స్ నడిపిన అనభువం ఉండాలని సికింద్రాబాద్ రీజియన్ మేనేజర్ సుచరిత ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు జేబీఎస్ డిపోలో నేరుగా సంప్రదించాల్సిందిగా సూచించారు. లేదంటేకింద పేర్కొన్న 12 డిపోలలకు వెళ్లి సంప్రదించాల్సిందిగా ఆర్టీసీ పేర్కొన్నారు.
►ALSO READ | గుడ్ న్యూస్.. కార్మికుల సహజ మరణానికి రూ.10 లక్షల బీమా.. SBI తో సింగరేణి ఒప్పందం
సికింద్రాబాద్ పరిధిలోని చెంగిచెర్ల, ఉప్పల్, కుషాయిగూడ, రాణిగంజ్, కంటోన్మెంట్, హకీంపేట్, మేడ్చల్, జీడిమెట్ల, కూకట్ పల్లి, హెచ్ సీయూ, మియాపూర్ 1, మియాపూర్ 2 డిపోలలో పనిచేసేందుకు అత్యవసరంగా డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి అప్లికేషన్లను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.
సంప్రదించాల్సిన నెంబర్: పర్సనల్ ఆఫీసర్, సికింద్రాబాద్: 9959226125 లేదా డిపో నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.