Reading Time: 2 minutes
ఎంత పని చేశావ్ సామి..!! రెమ్యునరేషన్ కారణంగా ప్రభాస్ సినిమాకు నో చెప్పిన నటుడు..

రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే మెంటలెక్కాల్సిందే.. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టారు రెబల్ స్టార్. ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజా సాబ్ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన రాజా సాబ్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు స్పిరిట్ సినిమా పై ప్రభాస్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఒక మూవీ సలార్. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సలార్ 2 సినిమా ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే సలార్ సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యిందని ఓ నటుడు తెలిపాడు. అది కూడా రెమ్యునరేషన్ కారణంగా ప్రభాస్ సినిమాలో నటించలేదు అని తెలిపాడు ఆ నటుడు ఇంతకూ ఆయన ఎవరంటే..

ఇది కూడా చదవండి : గుండు వెనక అసలు కారణం ఇదే.. కన్నీళ్లు పెట్టిస్తున్న రమణ గోగుల ఎమోషనల్ స్టోరీ

ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ప్రస్తుతం వరుస సినిమాలతో రాణిస్తున్నారు. సహాయక పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు అజయ్ ఘోష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. సినిమా రంగంలోకి వచ్చే యువత కృష్ణానగర్, ఇంద్రానగర్ వంటి ప్రాంతాల్లో తిండిలేక, అద్దెలు కట్టుకోలేక ఉన్నారని, ఇంజినీర్లు, ఎంబీఏలు చేసిన వారు సైతం అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేరి నానా నరకం అనుభవిస్తారని ఆయన అన్నారు. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసుకుంటూ సినీ పరిశ్రమలో స్థిరపడాలని చూస్తున్నారని, అలాంటి వారి కష్టాన్ని తాను గౌరవిస్తానని తెలిపారు.

ఇది కూడా చదవండి : చూసుకోవాలికదమ్మా..!! అడ్డంగా దొరికిపోయిన సింగర్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఈ సందర్భంలోనే మొహమాటం వల్ల తాను ఎదుర్కొన్న ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని అజయ్ ఘోష్ పంచుకున్నారు. ప్రభాస్ నటించిన సలార్‌ సినిమా కోసం తనను దర్శకుడు ప్రశాంత్ నీల్ పిలిచారని, ఆయన అంతా చూసి, పాత్ర గురించి వివరించారని తెలిపారు. ప్రశాంత్ దగ్గర ఉండే చౌదరి గారు కథను తనకు చెప్పారని, అంతా అనుకున్నట్లుగానే ముందుకు సాగిందని.. అయితే, పారితోషికం (డబ్బులు) విషయంలో తేడాలు తలెత్తాయని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. ఒకరి ద్వారా తనకు ఒక పారితోషికం మొత్తం గురించి సమాచారం వచ్చిందని, అయితే యూనిట్ నుండి ఇంకొకరు వేరే మొత్తం గురించి చెప్పారని ఆయన వివరించారు. దీనిపై తాను ప్రశ్నించినప్పుడు, రిక్వెస్ట్ చేసే పద్ధతిగా కాకుండా మాట్లాడారని, ఇది తనకు నచ్చలేదని తెలిపారు. తాను వేరే సినిమా కూడా చేశానని, తన విలువ తనకు తెలుసనే భావనతో ఉన్నప్పుడు, ఈ విధమైన మాటలు తనకు రుచించలేదన్నారు. దాంతో “నాకు వద్దులే స్వామి, నాకు డేట్లు కూడా లేవులే” అని చెప్పి తాను సలార్‌ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు అజయ్ ఘోష్ తెలిపారు. కొన్నిసార్లు ఒకరికి మంచి చేయబోతే అది మనకే రివర్స్ అవుతుందని, అయితే ఇలాంటివి చిత్ర పరిశ్రమలో సహజంగా జరిగేవేనని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు.

ఇది కూడా చదవండి : 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.