
దేశ ప్రజల్లారా మీకో విన్నపం.. శుభవార్త.. గుడ్ న్యూస్. అమెరికా, ఇరాన్ యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచబోతున్నారంటూ వస్తున్న వార్తలను.. అత్యంత తీవ్రంగా ఖండించింది కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. సోషల్ మీడియాతోపాటు కొన్ని ఆన్ లైన్ పోర్టల్స్ లో లీటర్ పెట్రోల్ పై 28 రూపాయలు, లీటర్ డీజిల్ పై 35 రూపాయలు పెంచబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించింది కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ.
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచే ఆలోచన లేదు.. అసలు అలాంటి ప్రతిపాదననే లేదు.. ఇప్పటి వరకు ఆలోచించలేదు అని స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలనలో కూడా ఉంచలేదని.. అసలు అలాంటి ఆలోచన చేయటం లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ చాలా చాలా స్పష్టంగా.. ఒట్టేసి మరీ చెబుతోంది. పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపునకు సంబంధించి వస్తున్న కథనాలు అన్నీ తప్పుడు కథనాలు అని.. ఫేక్ వార్తలు అని.. ఎవరూ నమ్మొద్దని.. ఎవరూ భయాందోళనలకు గురి కావొద్దని.. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మి.. ముందస్తుగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దని కూడా సూచించింది కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ.
ALSO READ : గూగుల్ లో 75 శాతం కోడింగ్ AI రాస్తుంది
FAKE NEWS
There are some news reports suggesting a price hike of petrol and diesel. It is hereby clarified that there is no such proposal under consideration by the Government.
Such news items are designed to create fear and panic amongst the citizens and are mischievous and… pic.twitter.com/yTAfJdah2o— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) April 23, 2026
కొందరు కావాలని.. పనిగట్టుకుని మరీ ఇలాంటి తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తూ.. దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఎవరూ వాటిని నమ్మొద్దని మరీ మరీ చెప్పింది పెట్రోలియం మంత్రిత్వ శాఖ. క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ఇప్పుడు 100 డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలోనే రోజుకు 16 వందల కోట్ల రూపాయలు ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయని.. దీనిని భర్తీ చేయాలంటే ధర పెంచటం ఒక్కటే మార్గం అని.. అందుకే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచబోతున్నారంటూ వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని స్పష్టం చేస్తూ.. X వేదికగా ఓ పోస్టును పెట్టింది కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ.
సో.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగవు.. పెరగబోవు.. పెరిగేది లేదు అని ఇంత ఖచ్చితంగా ప్రభుత్వం చెబుతుంటే.. ఇక టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటీ చెప్పండి.. సో.. డోంట్ వర్రీ.. ఎప్పటిలాగే హ్యాపీగా రోడ్డెక్కేయండి.. బంకులు ఓపెన్ చేసే ఉంటాయి.. అదే ధరకు దొరుకుతుంది..