Reading Time: 2 minutes

‘పెద్ది’ సెట్స్‌లో సందడి చేసిన ‘వాలా 2’ టీమ్.. మెగా అండతో రాబోతున్న క్రేజీ సీక్వెల్!

Caption of Image.

మలయాళ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘వాజా’ (Vaazha)  సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రదర్స్’.  ఇప్పటికే మాలీవుడ్‌లో రూ. 200 కోట్ల  పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీ ‘ వాలా 2’ పేరుతో  తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది., రేపు ( ఏప్రిల్ 24, 2026 ) గ్రాండ్‌గా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.

పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ !

సాధారణంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉన్న సినిమాలకే మేకర్స్ పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తారు. తెలుగులో రిలీజ్ అవుతున్న ‘వాలా 2’ విషయంలోనూ చిత్ర యూనిట్ అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. రేపు విడుదల కానున్న నేపథ్యంలో, ఈ రాత్రి నుండే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఓవర్సీస్ , కేరళలో వచ్చిన భారీ రెస్పాన్స్‌ను ఇక్కడ కూడా రిపీట్ చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు టాలీవుడ్ లెవల్లో భారీ హైప్ తీసుకురావడానికి మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేశారు. చిత్ర హీరోలు హషీర్ హెచ్, అలాన్ బిన్ సిరాజ్, అజిన్ జోయ్ , వినాయక్ వి.. హైదరాబాదులో ‘పెద్ది’ (Peddi) షూటింగ్ సెట్స్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను కలిశారు. సినిమా విశేషాలను చరణ్‌తో పంచుకున్నారు. ఈసందర్భంగా ఆయన చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. త్వరలోనే రామ్ చరణ్ నుండి ఒక స్పెషల్ వీడియో మెసేజ్ కూడా విడుదల కానుంది. చరణ్ వంటి స్టార్ హీరో నుంచి సపోర్ట్ లభించడం సినిమా ఓపెనింగ్స్‌కు భారీగా ప్లస్ కానుంది.

తెర వెనుక ఉన్న బలమైన టీమ్

ఈ చిత్రానికి కథను ‘జయ జయ జయ జయ హే’ ఫేమ్ విపిన్ దాస్ అందించగా, సావిన్ ఎస్ఏ దర్శకత్వం వహించారు. మలయాళంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా, స్నేహం , ఎమోషన్స్ కలబోతగా వచ్చిన ఈ సినిమా యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు విపిన్ దాస్ స్క్రీప్ట్ అందించారు.   డబ్ల్యుబిటిఎస్ ప్రొడక్షన్స్, ఇమాజిన్ సినిమాస్, షైన్ స్క్రీన్స్, సిగ్నేచర్ స్టూడియోస్, ఐకాన్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 

ALSO READ : అనిల్ రావిపూడి సినిమాలో షాకింగ్ కాంబినేషన్..

కథా నేపథ్యం..

ఈ యూత్ ఫుల్ సినిమా.. చదువు అబ్బని నలుగురు కుర్రాళ్ళ స్నేహం చుట్టూ తిరుగుతుంది. పాఠశాల దశలో ‘వేస్ట్ బ్యాచ్’ అనిపించుకున్న  వీరు చివరకు ఏం తెలుసుకున్నారు. చదువు పూర్తయ్యాక ఉపాధి కోసం భారత్, దుబాయ్,, యూకే వంటి ప్రాంతాలకు వెళ్లి స్థిరపడటానికి పడే కష్టాలను ఈ కథలో సహజంగా చూపించారు దర్శకుడు.  ఈ మూవీలో అజిన్ జాయ్, వినాయక్, హాషిర్, సుధీష్, అల్ఫోన్స్ పుత్రెన్ కీలకపాత్రలో నటించారు. అంకిత్ మీనన్ సంగీతాన్ని అందించారు. 

కేవలం కామెడీ మాత్రమే కాకుండా, నేటి తరం యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, స్నేహం వెనుక ఉండే ఆప్యాయతలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఇప్పటికే 200 కోట్లు కొల్లగొట్టిన ఈ ‘బిలియన్ బ్రదర్స్’ స్టోరీ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి..

 

©️ VIL Media Pvt Ltd.