
ముంబై సిటీ షాక్.. ఘక్కోపర్.. మాన్ కుర్ధ్ లింక్ రోడ్డులో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కలకలం రేపింది. ఈ లింక్ లో ఓ చోట పార్కింగ్ చేసి ఉన్న కార్లు.. పెద్ద పెద్ద శబ్దాలతో పేలుతూ.. మంటల్లో కాలిపోవటం సంచలనంగా మారింది. కొన్ని కార్లలో CNG గ్యాస్ సిలిండర్లు ఉండటం.. మంటల్లో అవి పేలటంతో పరిసర ప్రాంతాలన్నీ భయానకంగా మారాయి. 12 కార్ల వరకు మంటల్లో కాలిపోయినట్లు ప్రాథమిక సమాచారం. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది, లోకల్ పీపుల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ఘట్‌కోపర్–మాన్‌ఖుర్డ్ లింక్ రోడ్డుపై గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 10 నుండి 12 కార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. దింతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది.
సమాచారం ప్రకారం గురువారం ఉదయం 11:45 గంటల సమయంలో మంటలు మొదలయ్యాయి. గోవండిలోని బైంగాన్ వాడి సిగ్నల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ సర్వీసులు అక్కడికి చేరుకున్నాయి.
ALSO READ : అంబానీ ఇంట్లో 7 స్టార్ హోటల్ కిచెన్..
అగ్నిమాపక సిబ్బంది చాలా వేగంగా స్పందించి, గంటలోపే అంటే మధ్యాహ్నం 12:30 గంటలకల్లా మంటలను అదుపులోకి తెచ్చారు. మధ్యాహ్నం 1:35 గంటల సమయానికి మంటలను పూర్తిగా చల్లార్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అధికారులు వేగంగా పనిచేయడం వల్ల మంటలు మిగతా చోట్లకు వ్యాపించలేదు.
ఈ భారీ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. మంటలు అంటుకోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు, సంబంధిత అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు.