
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బస్సులను నడిపేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్పరిధిలోని పలు డిపోల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపడుతున్నారు. ఇప్పటికే 225 మంది ఎంపిక పూర్తవగా.. ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి.
తాజాగా సికింద్రాబాద్ రీజియన్ పరిధిలోని చెంగిచర్ల, కుషాయిగూడ, రాణిగంజ్, హబ్సిగూడ, మేడ్చల్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, మియాపూర్–1, 2 తదితర డిపోల పరిధిలో ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అధికారులు సూచించారు. పదోతరగతి పాసై, 18 నెలల హెవీ వెహికల్ డ్రైవింగ్ లో అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.