
ardik Pandya : ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు అస్సలు కలిసి రావడం లేదు. మైదానంలో ఆటగాడిగా, కెప్టెన్‌గా విఫలమవుతున్న హార్దిక్.. బయట తన ప్రవర్తనతో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో 103 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత హార్దిక్ చేసిన కొన్ని పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటికి వెళ్ళమని చెప్పడం నుంచి, ఓటమి తర్వాత డ్యాన్స్ చేయడం వరకు అన్నీ వివాదాస్పదమవుతున్నాయి.
గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో వివాదం
ముంబై ఇండియన్స్ 103 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత కెమెరాలు హార్దిక్ పాండ్యా వైపే ఉన్నాయి. ఆ సమయంలో హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ మహికాతో ఏదో సీరియస్‌గా మాట్లాడుతున్నట్లు కనిపించింది. అక్కడే హార్దిక్ కుమారుడు అగస్త్య కూడా ఉన్నాడు. సైగలతో మహికాను ఇంటికి వెళ్ళమని, వెళ్ళిన తర్వాత కాల్ చేయమని హార్దిక్ చెప్పినట్లు ఆ వీడియో ద్వారా అర్థమవుతోంది. ఈ క్లిప్ బయటకు రావడంతో ముంబై ఇంత ఘోరంగా ఓడిపోతే ఈయనకు పర్సనల్ గొడవలే ముఖ్యమా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Hardik Pandya taking care of his girlfriend and son after the match. pic.twitter.com/xFlQD4O0pD
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 23, 2026
ఓటమి తర్వాత డ్యాన్స్.. వెల్లువెత్తిన ట్రోల్స్
ఇక ఇదే మ్యాచ్ తర్వాత మరో వీడియో హార్దిక్ అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. సీఎస్కే చేతిలో చిత్తుగా ఓడిపోయిన కొద్దిసేపటికే హార్దిక్ ఏదో పాటకి సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయిందని, అభిమానులు బాధపడుతుంటే.. బాధ్యత గల కెప్టెన్ ఇలా ఎలా ప్రవర్తిస్తారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. హార్దిక్ సీరియస్‌నెస్ లేని కెప్టెన్ అని, అందుకే ముంబై ఓడిపోతోందని ట్రోల్స్ చేస్తున్నారు.
From gentleman captains like Sachin Tendulkar, Ricky Ponting, and Rohit Sharma to Chapri Hardik Pandya, unreal downfall of my beautiful franchise
pic.twitter.com/FNAM4jDKdg
— TEJASH
(@LoyleRohitFan) April 24, 2026
ఆటలోనూ అట్టర్ ఫ్లాప్
ఈ మ్యాచ్‌లో హార్దిక్ ప్రదర్శన కూడా అత్యంత దారుణంగా ఉంది. బౌలింగ్‌లో కేవలం 2 ఓవర్లు వేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నారు. ఇక బ్యాటింగ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి కేవలం ఒకే ఒక్క పరుగు (2 బంతుల్లో) చేసి అవుట్ అయ్యారు. ఒక రకంగా ఆల్‌రౌండర్‌గా, కెప్టెన్‌గా ముంబై ఓటమికి ప్రధాన కారణాల్లో హార్దిక్ ఒకరయ్యారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి కారణమని, జట్టులో మార్పులు అవసరమని పేర్కొన్నారు.
ముంబై భవితవ్యం ఏమిటి?
హార్దిక్ కెప్టెన్సీపై గత కొద్ది రోజులుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ ఆటగాళ్ళతో విభేదాలు, ఇప్పుడు మైదానంలో ఇలాంటి వింత ప్రవర్తనతో హార్దిక్ తన పేరును మరింతగా పాడుచేసుకుంటున్నారు. ముంబై తన తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 29న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా హార్దిక్ తన ఆటతీరును, ప్రవర్తనను మార్చుకుని ముంబైని గెలిపిస్తాడా లేక తన వివాదాలతో జట్టును మరింత ముంచుతాడా అనేది చూడాలి.
(@LoyleRohitFan)