
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బైకు, రెండు కార్లను అతివేగంగా వచ్చి ఢీకొట్టింది డీసీఎం. శుక్రవారం ( ఏప్రిల్ 24 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడూకోల్ రోడ్డు చౌరస్తా దగ్గర జరిగింది ఈ ప్రమాదం. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బైకు, రెండు కార్లను అతివేగంగా వచ్చిన డీసీఎం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుడు బిచ్కుంద మండలం గోపనపల్లికి చెందిన కుర్మా హన్మండ్లుగా గుర్తించారు పోలీసులు.
►ALSO READ | ముత్తోజిపేటలో టెన్షన్: నర్సంపేట డిపోలో నివాళుల అంశంపై కొలిక్కిరాని చర్చలు
డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న డీసీఎం డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.