Reading Time: < 1 minute

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలి : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

Caption of Image.
  • చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి/రామడుగు/మల్యాల, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు సౌకర్యాలు కల్పించాలని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. చొప్పదండి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్లను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మొద్దని సూచించారు. 

అనంతరం చొప్పదండి క్యాంపు ఆఫీసులో 67 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, ముగ్గురు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు అందజేశారు. అంతకుముందు జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ వడ్లూరి సరిత, ఏఎంసీ చైర్మన్లు కొత్తూరి మహేశ్‌‌‌‌‌‌‌‌, బొమ్మెరవేణి తిరుమల, బత్తిని మల్లీశ్వరి, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ పెరుమాండ్ల మానస, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, జవ్వాజి హరీశ్‌‌‌‌‌‌‌‌​, పట్టణ అధ్యక్షుడు చందు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.