
సినిమా హీరోయిన్స్ తో పాటు సీరియల్ భామలు చాలా క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. సినిమా తరాలకు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో సీరియల్ నటులు ముఖ్యంగా అందాల భామలకు అదే క్రేజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్లు కూడా ఎక్కడ తగ్గకుండా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటూ ఆకట్టుకుంటున్నారు వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సీరియల్ నటి చాలా మంది అభిమాన నటి. సీరియల్ నటిగానే కాదు యాంకర్ గాను చేసి మెప్పించింది ఆ అందాల తార. అయితే ఆ అమ్మడు గతంలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్ అవుతున్నాయి. తన చెల్లికి సెట్ చేద్దామనుకున్న సంబంధాన్ని ఆమె సెట్ చేసుకోని అతనిని పెళ్లి చేసుకుంది. అది కూడా లవ్ మ్యారేజ్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆతను ఆమె కన్నా నాలుగు నెలలు చిన్నవాడు. ఇంతకూ ఆ సీరియల్ నటి ఎవరో ఒక్కసారి చూద్దాం.!
ఇది కూడా చదవండి : గుండు వెనక అసలు కారణం ఇదే.. కన్నీళ్లు పెట్టిస్తున్న రమణ గోగుల ఎమోషనల్ స్టోరీ
సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో సమీరా షరీఫ్ ఒకరు. ఈ అందాల భామ టీవీ సీరియల్స్ రంగంలో తన కెరీర్‌ను ప్రారంభించింది, అనేక సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా సమీర ప్రసారమైన ఆడపిల్ల సీరియల్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత భార్యమణి, అభిషేకం, ముద్దుబిడ్డ, తోడికోడళ్లు, మూడు ముళ్ల బంధం వంటి పలు డైలీ సీరియల్స్‌లో నటించారు. నటిగానే కాకుండా యాంకర్‌గానూ పలు కార్యక్రమాలు చేసింది. ఆ మధ్య జబర్దస్త్ షో లోనూ యాంకర్ గా చేసింది సమీర.
ఇది కూడా చదవండి : చూసుకోవాలికదమ్మా..!! అడ్డంగా దొరికిపోయిన సింగర్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
కాగా గతంలో సమీరా షరీఫ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.., తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపారు. తన భర్త వయస్సులో తనకంటే నాలుగేళ్లు చిన్నవాడని, అంతేకాకుండా మొదట తన చెల్లెలి కోసం చూసిన వ్యక్తిని తానే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపింది. సమీరా షరీఫ్ వివాహం చేసుకున్న వ్యక్తి సీరియల్స్, సినిమాలలో నటిగా పేరు పొందిన సనా కుమారుడు అన్వర్. సమీరా, సనా అనేక సీరియల్స్‌లో కలిసి నటించారు. ఆ సమయంలోనే సనా కుమారుడు అన్వర్‌తో సమీరాకు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసుకునేవారు. మొదట్లో సమీరా తన చెల్లెలికి అన్వర్‌తో పెళ్లి చేయాలని అనుకుందట. కానీ సమీర , అన్వర్ మధ్య బాండింగ్ పెరగడంతో పాటు అన్వర్ సమీరాను ప్రేమించడంతో, అతడి వ్యక్తిత్వం నచ్చి తన చెల్లెలికి చూడాలనుకున్న వ్యక్తిని తానే వివాహం చేసుకుందట. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.