
సినిమా బిజినెస్ చర్చల సరళి మారింది. ఒకప్పుడు థియేట్రికల్ వసూళ్ల గురించి చర్చ జరిగేది, ఇప్పుడు ఓటీటీ డీల్స్‌పై భారీ బజ్ కనిపిస్తోంది. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా ఓటీటీ డీల్ ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. 2023లో విడుదలైన జైలర్ మొదటి భాగం భారీ విజయం సాధించి, సీక్వెల్‌పై అంచనాలను అమాంతం పెంచింది. జైలర్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతూ చివరి దశకు చేరుకుంది. ఇది పక్కా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈత్రంలో రజినీకాంత్‌తో పాటు ఇతర భాషల హీరోలు కూడా సందడి చేయనున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు దాదాపు 160 కోట్లకు అమ్ముడుపోయినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. గత కొన్ని వారాల ముందే స్ట్రీమింగ్ రైట్స్ డీల్‌ను మేకర్స్ ఓకే చేశారని వార్తలు వస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?