Reading Time: < 1 minute

ఇండియా గొప్ప దేశం.. నరకకూపం వ్యాఖ్యలపై మాట మార్చిన ట్రంప్ !

Caption of Image.

భారతదేశాన్ని “నరకకూపం”గా పేర్కొన్న వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇచ్చారు. భారతదేశం తనకు చాలా మంచి స్నేహితుడు నాయకత్వం వహిస్తున్న గొప్ప దేశంగా ట్రంప్ భావిస్తున్నారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. అమెరికాలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అంటే పుట్టుకతో వచ్చే పౌరసత్వం వ్యవహారం పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ భారత్, చైనా వంటి దేశాలను తీవ్రంగా అవమానించేలా ఉండటం చర్చనీయాంశమైంది.

ప్రముఖ కన్జర్వేటివ్ టాక్ షో హోస్ట్ మైఖేల్ సావేజ్.. భారత్, చైనా దేశాలను “నరకకూపాలు” అని సంబోధించారు. ఈ దేశాల నుంచి గర్భిణీలు 9వ నెలలో విమానాల్లో అమెరికాకు వచ్చి పిల్లలకు జన్మనిస్తున్నారని, తద్వారా ఆ పిల్లలకు తక్షణమే అమెరికా పౌరసత్వం పొందుతున్నారని ఆరోపించారు. ఇలా పౌరసత్వం పొందిన తర్వాత.. ఆ పిల్లల ద్వారా తమ ఫ్యామిలీ మొత్తాన్ని చైనా, భారత్ వంటి దేశాల నుంచి అమెరికాకు రప్పిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించడమే కాకుండా, వాటి ట్రాన్స్‌క్రిప్ట్‌ను సోషల్ మీడియాలో స్వయంగా పోస్ట్ చేయడం కలకలం రేపింది.

►ALSO READ | తమిళనాడులో 84.41 శాతం.. బెంగాల్లో 91.46 శాతం పోలింగ్.. 1947 నుంచి ఇంత ఓటింగ్ ఎప్పుడూ జరగలే !

భారత్, చైనాలను కించపరిచే విధంగా ప్రస్తావించిన ఒక వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరిగి షేర్ చేశారన్న వార్తలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం స్పందిస్తూ.. తాము కొన్ని నివేదికలను చూశామని పేర్కొంది. అయితే.. ట్రంప్ వైఖరిపై వ్యాఖ్య చేయడానికి భారత విదేశాంగ శాఖ నిరాకరించింది.

©️ VIL Media Pvt Ltd.