Reading Time: < 1 minute

రాజ్యసభలో ఆప్ ఖాళీ: ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి జంప్..!

Caption of Image.

న్యూఢిల్లీ: కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి బిగ్ షాక్ తగిలింది. ఆప్‎కు చెందిన ఏడుగురు రాజ్య సభ ఎంపీలు బీజేపీలో చేరారు. కీలక నేత రాఘవ్ చద్దాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్య సభలో ఆప్‎కు మొత్తం 10 ఎంపీలు ఉన్నారు. ఇందులో ఏడుగురు ఎంపీలు (2/3 వంతు) బీజేపీలో చేరడంతో నిబంధనల ప్రకారం రాజ్యసభలో ఆప్ ఎల్పీ బీజేపీలో విలీనమైంది. 

ఈ సందర్భంగా రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల పార్లమెంట్ సభ్యులం భారత రాజ్యాంగ నిబంధనలను అనుసరించి బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. 

నా రక్తం ధారపోశా: చద్దా

ఆప్‎కు రాజీనామా సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాఘవ్ చద్దా హాట్ కామెంట్స్ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కోసం నా రక్తం, చెమట ధారపోశా. పార్టీ కోసం 15 ఏళ్లుగా ఎంతో అంకిత భావంతో పని చేశా. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు నైతిక విలువలు, సిద్ధాంతాలు పాటించడం లేదు. 

►ALSO READ | అంతా అనుకున్నట్లే జరిగిందే..! : బీజేపీలో చేరిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా

ఆ పార్టీ దేశం కోసం, జాతీయ ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. కేవలం వ్యక్తిగత లాభం కోసమే పని చేస్తోంది. చాలా మంది నాకు ఈ విషయం ఎప్పటి నుంచో చెబుతున్నారు. నేను కూడా తప్పుడు పార్టీలో ఉన్నానని భావించాను. అందుకే ఈ తప్పుడు పార్టీని వీడి ప్రజల దగ్గరకు వెళ్తున్నాను ’’ అని అన్నారు. 

ఆప్‎కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలు వీరే:

1.రాఘవ్ చద్దా
2.సందీప్ పాఠక్
3.అశోక్ మిట్టల్
4.స్వాతి మాలివాల్
5.హర్భజన్ సింగ్
6.రాజిందర్ గుప్తా
7.విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ

©️ VIL Media Pvt Ltd.