Reading Time: < 1 minute
Raaka Unit Fida For Deepikas Dedication Also Makers Clarify On Rumors

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఆమె రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆమె నటిస్తున్న భారీ చిత్రం ‘రాకా’లో దీపికా పాత్రను తగ్గిస్తున్నారని లేదా ఆమె స్క్రీన్ టైమ్ మారుస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది.

దీపికా పదుకొనె గర్భం దాల్చినప్పటికీ సినిమా షెడ్యూల్‌లో గానీ ఆమె పాత్ర నిడివిలో గానీ ఎలాంటి మార్పులు చేయడం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. షూటింగ్ పనులు ప్రస్తుతం చాలా సాఫీగా సాగుతున్నాయని, ఆమె మునుపటి ప్లానింగ్ ప్రకారమే సెట్స్‌కు హాజరవుతున్నారని తెలిపారు. దీపికా పట్ల గౌరవంతో షూటింగ్ వాతావరణం ఆమెకు అనుకూలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సినిమాలో దీపికా కొన్ని పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంది. దీని కోసం చిత్ర యూనిట్ ప్రత్యేక  సేఫ్టీ మెజర్స్  పాటిస్తోంది. గర్భిణీగా ఉన్నప్పటికీ  దీపికా డెడికేషన్ కు టీమ్ మొత్తం ఫిదా అవుతోంది. యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ సమయంలో దీపికకు ఏమాత్రం శ్రమ కలగకుండా స్టంట్ మాస్టర్స్ మరియు దర్శకుడు అట్లీ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతానికి అంతా అనుకున్నట్లుగానే జరుగుతున్నా సినిమా భారీ బడ్జెట్‌తో కూడుకున్నది కావడంతో భవిష్యత్తులో షెడ్యూల్స్ ఏవైనా మారితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అల్లు అర్జున్ – అట్లీ వంటి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారట.