Reading Time: 2 minutes

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై.. CSK తుది జట్టు ఇదే! 

Caption of Image.

ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరు జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్డిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వాంఖడేలో రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉండటంతో ముంబైకి ఇది కలిసొచ్చే అంశం. కాగా ముంబై ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, చెన్నై ఒక మార్పుతో మ్యాచ్ ఆడబోతుంది. 

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్డిక్ పాండ్యా మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేస్తాం.. గత మ్యాచ్‌లో మా ప్రదర్శన చాలా బాగుంది, ఆటగాళ్లందరూ సమన్వయంతో ఆడారు. అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలనుకుంటున్నాం.. పిచ్ పచ్చగా కనిపిస్తున్నప్పటికీ, బ్యాటింగ్‌కు సహకరిస్తుందని భావిస్తున్నాను.. మేము గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని వెల్లడించాడు. 

CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే మేము కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లం.. ఇది 50– -50 నిర్ణయమే.. వాంఖడేలో భారీ స్కోరు సాధించాల్సి ఉంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో కీలక సమయాల్లో మేము అవకాశాలను చేజార్చుకున్నాం, ఈసారి వాటిని అందిపుచ్చుకుని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఎంఎస్ ధోని గురించి మాట్లాడుతూ.. ఆయన ఇక్కడ లేకపోవడం దురదృష్టకరం, కానీ మా ప్రదర్శనతో వారిని సంతోషపెడతాం.. ఈ మ్యాచ్ కోసం మా జట్టులో ఒక మార్పు చేశాం.. షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్ తుది జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు.

తుది జట్లు: 
ముంబై ఇండియన్స్: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), తిలక్ వర్మ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, క్రిష్ భగత్, AM గజన్‌ఫర్, అశ్వనీ కుమార్

చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరి 

©️ VIL Media Pvt Ltd.