
హర్యాన నటి, సింగర్, సోషల్ మీడియా స్టార్ దివ్యాంకా సిరోహి గుండెపోటుతో మృతి చెందింది. మంగళవారం (ఏప్రిల్ 21, 2026న) రాత్రి ఘజియాబాద్‌లోని తన నివాసంలో ఆకస్మికంగా కుప్పకూలగా, ఆసుపత్రికి తరలించేలోపే వైద్యులు మరణించినట్లు ప్రకటించారు.
సోదరుడు హిమాన్షు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె క్రింద పడిపోవడంతో తలకు గాయం కూడా అయినట్లు సమాచారం. అయితే గుండెపోటే ఆమె మరణానికి ప్రధాన కారణమని నివేదికలు చెబుతున్నాయి. 50కి పైగా హర్యానవీ మ్యూజిక్ వీడియోల్లో నటించి గుర్తింపు పొందింది. నటిగా, సింగర్ గా రాణిస్తూ మంచి భవిష్యత్తు ఉన్న దివ్యాంకా, ఇలా సడెన్ గా చనిపోవడంతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది.
AICWA భావోద్వేగ నివాళి:
ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA): దివ్యాంకా మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. “ కేవలం 29 ఏళ్ల వయసులోనే దివ్యాంక మనల్ని విడిచి వెళ్లడం అత్యంత బాధాకరం. ఇది ఆమె కుటుంబానికే కాకుండా చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఒక కళాకారుడి కష్టాలు, కలలు మరో కళాకారుడికి మాత్రమే అర్థమవుతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.” అని సంఘం నోట్ రిలీజ్ చేసింది.
We are deeply saddened to share the untimely passing of actress and dancer Divyanka Sirohi at the young age of 30. Gone far too soon, her loss is not just personal to her loved ones, but a profound loss to the entire film fraternity.
Divyanka had made a significant mark in the… pic.twitter.com/6Lr381mRDo
— All Indian Cine Workers Association (@aicwaofficial) April 22, 2026
వైరల్ వీడియోస్..
1996 నవంబర్ 19న జన్మించిన దివ్యాంకా సిరోహి, మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీలో బీసీఏ, అనంతరం సిక్కింలో ఎంబీఏ పూర్తి చేసింది. 50కి పైగా హర్యానా పాటల్లో నటించిన ఆమె, మసూమ్ శర్మ, అమిత్ సైనీ రోహ్తాకియా, కేడీ వంటి ప్రముఖులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. టిక్‌టాక్‌లో చేసిన ‘Meri Mammi’ వీడియోతో ఒక్కసారిగా స్టార్‌గా మారి, 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
దివ్యాంకా సిరోహి మృతి తర్వాత, 2023లో చేసిన “Shiva, take me with you” అనే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతూ అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. అలాగే, ఆమె చివరి వీడియోలో బర్సానా మిలా హై పాటకు డాన్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతుంది.