
ఎప్పుడో పనరిచయమున్న ఓ ఇద్దరు మనుషులు కనపడితే చాలు.. ఒకరిపై మరొకరు ఎంతో ప్రేమను ఒలకబోస్తుంటారు.. కొంతమంది దగ్గర మధ్య ప్రేమ.. అనురాగం.. ఆప్యాయత నిజంగా ఉంటే.. మరికొంతమంది మాత్రం ఏదో కనపడ్డారుకదా అని కల్లబొల్లి ప్రేమను చూపిస్తుంటారు. మరి ప్రేమ అనే ఈ రెండు అక్షరాలే ఈ కలిలో ఎంతో మాయలో పడేస్తున్నాయి మరి రెండు అక్షరాల ప్రేమ లో ఎన్ని రకాలున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . .
లోకములో మూడు రకములైన ప్రేమలున్నయని పలు గ్రంధాల ద్వారా తెలుస్తుంది. అవి 1. స్వార్థప్రేమ .. 2. అన్యోన్యప్రేమ ..3. పరార్థప్రేమ
స్వార్థప్రేమ: తనను మాత్రము తాను ప్రేమించుకొని, పరుల సుఖములో పాల్గొనక, వారి దుఃఖమును గమనించక స్వార్ధమునే అనుసరించుట. స్వార్థప్రేమ రూములో వేసుకున్న బల్బువంటిది, దాని వెలుతురు ఆ రూములో వారికి మాత్రమే, మరొకరికి దానివలన ప్రయోజనముండదు. అవతలి వ్యక్తి సంతోషం కంటే తన సొంత కోరికలు, అవసరాలు, ఆనందానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంటుంది. ఇది నిజమైన ప్రేమ కాదు. వారి అవసరాల కోసం ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటారు. ఇలాంటి వారు ఇతరులను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటారు. అవసరం తీరేంతవరకు మీతో ప్రేమగా ఉంటారు. ఇలాంటి వారు తాను ఇష్టపడుతున్నవారికి ఎలాంటి ఉపకారము చేయరు. నిరంతరం అనుమానం, భయం, అభద్రతాభావంతో ఉంటారు. నిజమైన ప్రేమలో నిస్వార్థం ఉంటుంది, స్వార్థప్రేమలో కేవలం తన సుఖమే ప్రధానంగా ఉంటుంది
అన్యోన్యప్రేమ: తన అనుకూలములను సాధించుట కొరకు తనను ప్రేమించు వారిని మాత్రము ప్రేమించుట, తనవారిని మాత్రం ప్రేమతో పలుకరించుట. అన్యోన్యప్రేమ వెన్నెలవంటిది. అన్యోన్య ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గాఢమైన, పరస్పర అనురాగం… అవగాహన. ఇది ఇద్దరి మనసులు కలిసినప్పుడు ఏర్పడే నిశ్శబ్దమైన, ఆత్మీయమైన అనుబంధం. అన్యోన్య ప్రేమలో కలహాలు, అపార్థాలు తొలగిపోయి, జీవితం సుఖసంతోషాలతో, ప్రేమపూర్వకమైన అనురాగంతో సాగుతుంది. ఇదిఇద్దరి మధ్య బలమైన సంబంధాన్ని ఏర్పరచి, దీర్ఘకాలికంగా కలిసి ఉండేందుకు బాటలు వేస్తుంది. ఇలా ఉండే వారు ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకుంటారు. వీరి మధ్య నమ్మకం, గౌరవం ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకోవడం.. ఇద్దరూ కలిసి సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్దపడతారు.
పరార్థ ప్రేమ: సర్వులనూ ఈశ్వరస్వరూపముగా భావించి, ఆదరించి, ఏకత్వముననుభవించి ఆనందించుట. పరార్థ ప్రేమ అంటే ప్రతిఫలం ఆశించకుండా, స్వార్థం లేకుండా ఇతరుల క్షేమాన్ని, సంతోషాన్ని కోరుకునే నిస్వార్థమైన ప్రేమ. ఇది మానవతావాదానికి, ఉన్నతమైన బంధాలకు మరియు ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉంటుంది. పరార్ధప్రేమ చూపే వారు వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా సేవ చేస్తారు. ఇతరుల కోసం తన అవసరాలను లేదా సంతోషాన్ని వదులుకోనేందుకు సిద్దపడతారు. సానుభూతి: ఇతరుల బాధను అర్థం చేసుకుని, సహాయం చేయడానికి ముందుకు వచ్చేలా ఉంటారుప్రేమ: కులం, మతం, వర్గ భేదాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తారు. ఇది స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది, నిర్మలమైనది.