Reading Time: < 1 minute
TG EAPCET 2026 Hall Tickets: టీజీ ఈఏపీసెట్‌కు దరఖాస్తుల వెళ్లువ.. మొత్తం ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసా?

హైదరాబాద్‌, ఏప్రిల్ 24: ఈసారి తెలంగాణ ఈఏపీసెట్‌కు దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఇప్పటి వరకు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లకు కలిపి మొత్తం 3,01,194 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 2,10,308 మంది, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌కు 90,569 మంది దరఖాస్తు చేశారు. రెండు విభాగాలకు సంబంధించి 317 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

టీజీ ఈఏపీసెట్‌ 2026 హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ పరీక్షలు మే 4 నుంచి మొదలవుతాయి. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. కాగా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను తాజాగా ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టీజీ ఈఏపీసెట్‌ 2026 హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎప్‌సెట్‌ పరీక్షలకు పరీక్షా కేంద్రాలు భారీగా ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ విభాగానికి 106 పరీక్ష కేంద్రాలు, ఇంజినీరింగ్‌కు 115 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మూడు గ్రూపులుగా దరఖాస్తులు స్వీకరించగా.. ఈ సారి గ్రూపు 2 నుంచి అత్యధిక దరఖాస్తులు రావడం విశేషం.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.