Reading Time: < 1 minute
Rukmini Vasanth Kayadu Lohar Miss Multiple Projects For Dragon And The Paradise

సినీ పరిశ్రమలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ దక్కిందంటే అది కెరీర్‌కు ప్లస్ అవుతుందని అందరూ భావిస్తారు. కానీ కొన్నిసార్లు ఆ భారీ చిత్రాల షూటింగ్ ఆలస్యం కావడం వల్ల నటీనటులు ఇతర అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్, యంగ్ హీరోయిన్ కాయదు లోహర్ విషయంలో ఇదే జరుగుతోంది. తాము కమిట్ అయిన భారీ పాన్ ఇండియా చిత్రాల కోసం వీరు దాదాపు 3 నుంచి 4 క్రేజీ సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మరియు మేకర్స్ కోరిన బల్క్ డేట్స్ కారణంగా ఆమె వేరే చిత్రాలకు సైన్ చేయలేకపోతోందట. ఇప్పటికే ఆమె చేతికి వచ్చిన కొన్ని మంచి ఆఫర్లను వదులుకున్నట్లు సమాచారం. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలో ఛాన్స్ అంటే అది మామూలు విషయం కాదు కాబట్టి, ఈ నిరీక్షణకు తగ్గ ఫలితం ఉంటుందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రంలో కాయదు లోహర్ ‘సుబ్బలక్ష్మి’గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె కూడా కొన్ని ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చిందని టాక్. ‘దసరా’ వంటి మాసివ్ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల తీస్తున్న సినిమా కావడంతో కాయదు లోహర్ ఈ చిత్రం కోసం ఎక్కువ డేట్స్ కేటాయిస్తోంది. ఈ సినిమాలు విడుదలైన తర్వాత ఈ ఇద్దరు భామలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రావాలని వారు చేసిన త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.